https://oktelugu.com/

Rama Banam Movie Review: గోపీచంద్ ‘రామబాణం’ మూవీ ఫుల్ రివ్యూ

విక్కీ(గోపీచంద్) అనే వ్యక్తి తన అన్నయ్య రాజారామ్ ( జగపతి బాబు ) తో గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు.వెళ్లే ముందు ఆయన ఒక గొప్ప ధనవంతుడిగా తిరిగి వస్తానని తన అన్నయ్య తో సవాలు విసురుతాడు.

Written By: , Updated On : May 5, 2023 / 12:08 PM IST
Follow us on

Rama Banam Movie Review: నటీనటులు : గోపీచంద్ , జగపతి బాబు, డింపుల్ హయాతి, కుష్బూ , నాజర్, వెన్నెల కిషోర్, సచిన్ ఖేద్కర్

దర్శకత్వం : శ్రీవాస్
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో ఒకడు మ్యాచో స్టార్ గోపీచంద్.’తొలివలపు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి, ఆ తర్వాత విలన్ గా ఎంతో గొప్పగా రాణించి ,మళ్ళీ హీరో గా రీ ఎంట్రీ ఇచ్చి నేడు ఈ స్థాయి లో ఉన్నాడు.కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో ఇతనికి ఉన్న బ్లాక్ బస్టర్ హిట్స్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆ రేంజ్ కి వెళ్లిన గోపీచంద్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో బాగా వెనకపడ్డాడు.కొన్ని సినిమాలు బాగున్నా కూడా దురదృష్టం కొద్దీ అవి ఫ్లాప్స్ అయ్యాయి.ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన చివరి చిత్రం ‘పక్కా కమర్షియల్’ కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.ఇప్పుడు ఆయన కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో తన మార్కు మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ‘రామ బాణం’ అనే సినిమా చేసాడు.నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఘనంగా విడుదలైంది, మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఎంత వరకు అలరించిందో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూద్దాము.

కథ :

విక్కీ(గోపీచంద్) అనే వ్యక్తి తన అన్నయ్య రాజారామ్ ( జగపతి బాబు ) తో గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు.వెళ్లే ముందు ఆయన ఒక గొప్ప ధనవంతుడిగా తిరిగి వస్తానని తన అన్నయ్య తో సవాలు విసురుతాడు.అలా కోల్ కతా వెళ్లిన విక్కీ పెద్ద మాఫియా డాన్ గా ఎదుగుతాడు.కానీ ఎప్పుడైతే ఆయన జీవితం లోకి భైరవి (డింపుల్ హయాతి) అనే అమ్మాయి ప్రవేశిస్తుందో అప్పటి నుండి ఆయన జీవితం మొత్తం మారిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు తన అన్నయ్య జయరాం ఇంటికి తిరిగి వచ్చేస్తాడు.కానీ విక్కీ వచ్చే సమయానికి కుటుంబం మొత్తం తీవ్రమైన విచారం లో ఉంటుంది.అసలు తన అన్నయ్య కుటుంబానికి ఏమైంది, విక్కీ ఆ సమస్యని ఎలా పరిష్కరించాడు అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

ఇలాంటి కథలు మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము, ట్రైలర్ చూసినప్పుడే ఈ చిత్రం పరమ రొటీన్ కమర్షియల్ సినిమా అనేది అర్థం అయ్యింది. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు క్లిక్ అయ్యాయి.స్టోరీ పరమ రొటీన్ గా ఉన్నా ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు, బాగానే ఉంది అని అనిపిస్తాది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా ట్రాక్ తప్పిపోయాడు డైరెక్టర్.నాసిరకం డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే తో అసలు ఈ సినిమాకి ఎందుకు వచ్చాము రా బాబు అనిపించే రేంజ్ లో ఆయన సెకండ్ హాఫ్ ని తీసాడు. గోపీచంద్ మార్కు హీరోయిజం ఉంటే సరిపోతుంది, కమర్షియల్ గా సక్సెస్ అయిపోతుంది అనే గుద్ది నమ్మకం తో డైరెక్టర్ ఈ చిత్రాన్ని తీసినట్టు అందరికీ అనిపించింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే గోపీచంద్ కి ఇలాంటి సినిమాలు కొత్తేమి కాదు, ఆయనకీ కొట్టినపిండి లాంటి జానర్ కాబట్టి చాలా చక్కగా నటించాడు.ఆయన లుక్స్ మరియు స్టైలింగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.ఇక యూట్యూబర్ గా హీరోయిన్ డింపుల్ హయాతి కూడా పర్వాలేదు అనే రేంజ్ లో నటించింది.జగపతి బాబు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి పాజిటివ్ క్యారక్టర్ చేసి మంచి మార్కులు కొట్టేసాడు.ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో ఒక సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావాలంటే కచ్చితంగా ఒకటి, లేదా రెండు పాటలు అయినా బాగుండాలి, పెద్ద హిట్స్ అవ్వాలి, అప్పుడే జనాలు ఆసక్తి చూపిస్తారు.కానీ ఈ చిత్రం లో పాటలు వచ్చినప్పుడల్లా ఆడియన్స్ కి నరకం లాగ అనిపించింది.ఒక్కటంటే ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు, పాటలు బాగున్నా కనీసం కమర్షియల్ గా యావరేజి అయినా అయ్యేది అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

చివరి మాట :

రొటీన్ కమర్షియల్ సినిమా..ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ మీ సహనాన్ని పరీక్షిస్తుంది.గోపీచంద్ మీద అభిమానం ఉన్నవాళ్లు ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

రేటింగ్ : 2.25 /5