Homeఎంటర్టైన్మెంట్Gopichand: గోపీచంద్.. సాంగ్ ప్రోమోలో కూడా 'పక్కా కమర్షియల్'...

Gopichand: గోపీచంద్.. సాంగ్ ప్రోమోలో కూడా ‘పక్కా కమర్షియల్’ !

Gopichand: హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయాడు. సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే, చిత్ర పరిశ్రమలో అన్ని ఉన్నా అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఆ అదృష్టమే ఈ హీరోకి ఆమడ దూరంలో ఉండిపోతుంది. ఇలాంటి హీరోకి మంచి హిట్ సినిమా ఇవ్వాలనే కసితో ప్రమోషన్స్ లో కూడా క్రియేటివిటీని చూపిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి.

Gopichand:
Gopichand:

కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” పై ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. గోపిచంద్ సరసన హీరోయిన్ గా రాశీఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా తాజాగా “పక్కా కమర్షియల్ ” టైటిల్ సాంగ్ ప్రోమోని చిత్ర బృందం విడుదల చేసింది.

ప్రోమోలో గోపీచంద్ లుక్ అండ్ గెటప్ బాగుంది. మొత్తానికి ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ గా స్క్రిప్ట్ రాశాడట. మారుతి నుండి మాత్రం మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు,

Gopichand
Gopichand

ఇప్పటికే మారుతి ఈ సినిమా విషయంలో వినోదం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చాడు. అయినా అల్లు అరవింద్ కంపెనీ నుండి వస్తుందంటే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందని అనుకోవచ్చు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular