Gopichand Malineni- Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను దర్శకుడు గోపీచంద్ సిద్ధం చేశాడట. ట్రైలర్ లో బాలయ్య ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడట.

బాలయ్య ఇంతకుముందు రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్స్ కొట్టాయి. అందువలన అదే నేపథ్యంలో దర్శకుడు గోపీచంద్ కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా యదార్థ ఘటనలు ఆధారంగా చేసుకొని ఈ పవర్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఉంటుందని టాక్.
బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ కొత్త లుక్ అదిరిపోయింది. ఈ సినిమా ట్రైలర్ టాక్ వింటుంటే.. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో హిట్ రావడం గ్యారెంటీ అనిపిస్తోంది.

అన్నట్టు కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారట. పైగా ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా మరో 30 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. కాబట్టి.. బాలయ్యకి కరెక్ట్ సినిమా పడితే 150 కోట్లు వసూళ్లు చేసే స్టామినా ఉందని మేకర్స్ నమ్ముతున్నారు.