RRR Viewers: ఒకపక్క ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ చూసి భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, కానీ సామాన్య జనం మాత్రం ఈ సినిమాని చూడాలంటే ఇన్నాళ్లు భయపడుతూ వచ్చారు. ఫ్యామిలీతో సహా ఈ సినిమాకి వెళ్ళాలి అంటే.. కనీసం, రెండు నుంచి మూడు వేలు ఖర్చు పెట్టాలి. ఒక సగటు సామాన్య కుటుంబం రెండు గంటల సినిమా కోసం ఆ స్థాయిలో ఖర్చు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపించదు.

అందుకే..ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్ని రికార్డులను నెలకొల్పి.. భారీ స్థాయి చరిత్రను సృష్టిస్తున్నా.. సాధారణ దిగువస్థాయి ఫ్యామిలీస్ కి మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఇక థియేటర్స్ లో మేము చూడలేమా ? అని బాధ పడిన సగటు జీవులకు ఈ రోజు నుంచి ఓ మంచి అవకాశం వచ్చింది.
అవును.. సామాన్య ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఇదే. అలాగే పెరిగిన టికెట్ రేట్ల కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఇంకా చూడని వారికి శుభవార్త. నేటి నుండి సినిమా టికెట్ రేట్లు తగ్గాయి. ముఖ్యంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లో 175 రపాయలు, మల్టీప్లెక్స్‌లో రూ. 295 గరిష్ట రేటుంది.
Also Read: RRR Flag: “ఎత్తర జెండా” పాటలో ఈ జెండా ని గమనించారా? ఆ జెండా నే ఎందుకు పెట్టారు ? దాని చరిత్ర ఏంటంటే ?
ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్ ధర రూ. 145, మల్టీప్లెక్స్‌లో రూ. 177 గా ఉంది. థియేటర్‌లోనే చూడాల్సిన భారీ హంగుల సినిమా ‘ఆర్ఆర్ఆర్’. కాబట్టి.. ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ విజువల్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూసేయండి. మరి టికెట్ రేట్లు తగ్గాయి కాబట్టి.. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది.
ఇప్పటికైతే ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. అసలు ఈ చిత్రం కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ సినిమా మేకర్స్ సైతం అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజులకు గానూ 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది గొప్ప రికార్డ్.
Also Read: RRR 10 Days Collections: షాకింగ్.. ఇది తెలుగు వాడి సింహ గర్జన !
[…] […]