Sai Dharam Tej: యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి అయినప్పటి నుంచీ పూర్తి ఇంటికే పరిమితం అయిపోయాడు. ఇన్నాళ్లు కొత్త సినిమా ముచ్చట్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా సాయి తేజ్ కూడా తన ఫ్యాన్స్ కి తన సినిమాలకు సంబంధించి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. నేను కొలుకున్నాను అంటూ ఆ మధ్య సాయి తేజ్ మెసేజ్ అయితే చేశాడు. ఆ తర్వాత తన కెరీర్ గురించి, తన కొత్త చిత్రాల సంగతుల గురించి తేజ్ ఎక్కడా బయట పెట్టలేదు. కాకపోతే ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకు వచ్చారు.

దీపావళి నాడు మెగా హీరోలు అందరూ ఆయనను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. అప్పుడు కూడా తేజ్ కొత్త సినిమాల గురించి చెప్పలేదు. కానీ, తన యోగక్షేమాల కోరుకున్న వారికి తేజ్ ధన్యవాదాలు తెలిపాడు. అయితే,కొత్త సినిమా ప్రకటన ఏది ? అంటూ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తేజ్ కి మెసేజ్ లు చేస్తూనే ఉన్నారు. అయితే, సాయి తేజ్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక శుభవార్త. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ నెలలోనే సెట్స్ లోకి మళ్లీ అడుగుపెట్టబోతున్నాడని తెలుస్తోంది.
Also Read: మాజీ భార్యతో మళ్ళీ అమీర్.. మరో క్రేజీ బయోపిక్ కి రంగం సిద్ధం !
నిజానికి యాక్సిడెంట్ తర్వాత మళ్లీ డబుల్ ఎనర్జీతో ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కనిపిస్తున్నాడు సాయి తేజ్. ఈ నేపథ్యంలోనే సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడట. బ్రేక్ పడిన ‘సాయి తేజ్ 15’ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో జనవరి మూడో వారం నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతోంది. యాక్సిడెంట్ తర్వాత.. సాయి తేజ్ చేస్తున్న తొలి సినిమా ఇదే. అందుకే, ఈ సినిమా పై ప్రత్యేక ఆకర్షణ ఉంది.
ఏది ఏమైనా సాయి తేజ్ ప్రమాదం మెగా ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ ప్రమాదం కారణంగా వినాయక చవితి నాడు ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం సాయి ధరమ్ తేజ్ ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరై ఇంటికి బైక్ పై వస్తుండగా… ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వస్తున్న ఆయన బైక్ అదుపు తప్పడంతో ధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలయ్యారు. పక్కనే ఉన్న జనాలు పోలీసులకు, అంబులెన్సుకి సమాచారం ఇవ్వడంతో, సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మెడికవర్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఎట్టకేలకు సాయి తేజ్ పూర్తిగా కోలుకున్నారు.
Also Read: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు చేదు వార్త.. ధోని సంచలన నిర్ణయం..!