‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ 30వ చిత్రానికి సంబంధించిన తాజా ప్రకటన ఎప్పుడొస్తుందా ? అని అభిమానులు ఆశగా చూసిన ఎదురుచూపులకు… మొత్తానికి ఫలితం దక్కింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బిగ్ ఎనౌన్స్ మెంట్ ను కొరటాల తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా పోస్టర్ ను రిలిన్ చేస్తూ అనౌన్స్ చేసాడు.
పైగా ఏప్రిల్ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించడం విశేషం. అలాగే కొరటాల పోస్ట్ చేసిన మెసేజ్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ‘లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల ఈ సినిమా ‘పాన్ ఇండియా మూవీ’ అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.
ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో తారక్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొరటాల ఈ చిత్రం కోసం బలమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అన్నట్టు ఆచార్య మూవీ రిలీజ్ కాకుముందే ‘ఎన్టీఆర్’ మూవీ పట్టాలెక్కడం నిజంగా విశేషమే.
సహజంగా కొరటాల సినిమా సినిమాకి కనీసం రెండేళ్లు గ్యాప్ తీసుకుంటాడు. కానీ ఈ సినిమాకి మాత్రం అసలు గ్యాపే తీసుకోడం లేదు. ఈ సినిమాని భారీ విజువల్స్ తో తీయాలని.. ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ కి దేశస్థాయి గుర్తింపు వస్తోంది కాబట్టి.. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి ఈ సినిమాకి దాదాపు 250 కోట్లు బడ్జెట్ పెడుతున్నారట. సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి నిర్మాతలు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Good news for ntr fans 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com