Good Bad Ugly : తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Thala Ajith Kumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. 20 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి, నేడే ఆఖరి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రం విడుదల కాబోతుంది. తమిళనాడు లోని దాదాపుగా అన్ని థియేటర్స్ లోనూ సూర్య రెట్రో చిత్రమే ప్రదర్శితం కానుంది. దీంతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని దాదాపుగా అన్ని థియేటర్స్ నుండి తీసేసారు. రేపు చెన్నై సిటీ మొత్తానికి కలిపి ఈ చిత్రానికి బుక్ మై షో లో కేవలం 13 షోస్ మాత్రమే షెడ్యూల్ చేయబడ్డాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా పని ఇక అయిపోయింది అని.
Also Read : గాయాలపాలైన హీరో అజిత్..హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు!
ఓవరాల్ తమిళనాడు మొత్తం కలిపి వంద షోస్ కంటే తక్కువే ఉన్నాయి ఈ చిత్రానికి. ఈ షోస్ నుండి వారం మొత్తం కలిపినా కోటి రూపాయల గ్రాస్ కూడా రాదు. కాబట్టి నేడే ఈ చిత్రానికి క్లోజింగ్ కలెక్షన్స్ వేసేసుకోవచ్చు అన్నమాట. 20 వ రోజున ఈ చిత్రానికి కోటి 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా తమిళనాడు లో 20 రోజులకు కలిపి ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 60 లక్షలు, కర్ణాటకలో 14 కోట్ల 45 లక్షలు, కేరళ నుండి 4 కోట్ల 5 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి రెండు కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి దాదాపుగా 67 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 244 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, 120 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి చాలా డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. 20 రోజుల్లో ఈ చిత్రానికి 6 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్, 3 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకో కోటి 71 లక్షల రూపాయిల షేర్ ని రాబడితే సూపర్ హిట్ స్టేటస్ లోకి వెళ్తుంది. కానీ ఆ అవకాశం లేనందున ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఎబోవ్ యావరేజ్ తో సరిపెట్టుకోవాల్సిందే. అయితే ఈ చిత్రం ప్రతిష్టాత్మక 250 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరడం, దాదాపుగా అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.