Good Bad Ugly : ఇష్టమైన హీరోల మీద అభిమానం చూపించడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆ అభిమానం హద్దులు దాటినప్పుడు చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అలాంటి ఉదాహరణలు ఎన్నో మనం చూసాము. హీరోలు బాగానే ఉంటారు, కానీ అభిమానుల జీవితాలు నాశనం అవుతుంటాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియా లో హీరోలను అభిమానులు దేవుళ్ళు లాగా భావిస్తుంటారు. వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడరు. హీరోలు కూడా ఇలాంటి అభిమానులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సోషల్ మీడియా లో తిరుగుతున్న వీడియో నెటిజెన్స్ ని భయభ్రాంతులకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే తమిళ హీరో అజిత్(Thala Ajith Kumar) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : గుడ్ బ్యాడ్ అగ్లీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు వెర్షన్ కూడా కుమ్ముతుందిగా!
టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమా వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి. అయితే నిన్న ఒక కాలేజీ కి చెందిన విద్యార్థులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఒక ట్రైన్ లో వచ్చారు. అజిత్ నామస్మరణ చేస్తూ ఫుట్ పాత్ మీద ఈ విద్యార్థులు చేసిన విన్యాసాలను చూస్తే భయపడిపోతారు. పొరపాటున క్రింద పడితే పరిస్థితి ఏమిటి?, ఎందుకు యువత ఇలా తయారు అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఫుట్ పాత్స్ మీద నుండి మాత్రమే కాదు, కిటికీలలో కాళ్ళు పెట్టి ఊగులాడుతూ వచ్చారు, ట్రైన్ ఆగిన వెంటనే పైన ఉన్న కమ్మిని పట్టుకొని పుషప్స్ చేయడం వంటివి చూసి నెటిజెన్స్ భయపడిపోతున్నారు. ఇలాంటి హీరో అజిత్ చూస్తే, అసలు సినిమాలు చేయడమే మానేస్తాడేమో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అత్యుత్సాహం అసలు మంచిది కాదు.
సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ వీడియో ని మీరే చూడండి. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల మార్కుని అందుకుంటుందని, కేవలం తమిళనాడు ప్రాంతం నుండే 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అజిత్ కెరీర్ లోనే అత్యంత భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా ఇది నిలుస్తుందని, తెలుగు వెర్షన్ వసూళ్లు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. రెండు నెలల క్రితం విడుదలైన ‘విడాముయార్చి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని ఎదురుకొని అజిత్ అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. రెండు నెలలు గడవకముందే, మళ్ళీ తన ఫ్యాన్స్ ని ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ ని నింపాడు అజిత్.
Also Read : 5 రోజుల్లో 175 కోట్లు..కానీ బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
Kadavuleyy… Ajitheyy.. !! Chennai presidency clg boys after watching GBU..#GoodBadUgly #Ajithkumar pic.twitter.com/uygf8U5EiL
— Kwood Gangster 🙂 (@Kwood_Gangster) April 16, 2025