Good Bad Ugly : తమిళ హీరో అజిత్(Thala Ajith) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) చిత్రం విడుదలై రెండు వారాలు అవుతున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద జోరు మాత్రం అసలు తగ్గలేదు. భారీ వసూళ్లు వస్తున్నాయని చెప్పలేము కానీ, చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి అనేది మాత్రం వాస్తవం. 12 వ రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 20 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ 13 వ రోజున కేవలం రెండు వేల టికెట్స్ మాత్రమే తగ్గాయి. 18 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇంత స్టడీ రన్ ఉంటుందని అజిత్ ఫ్యాన్స్ కూడా ఊహించలేదట. ఎందుకంటే ఈ చిత్రాన్ని కేవలం అజిత్ ఫ్యాన్స్ కోసం తీశారు. ఫస్ట్ హాఫ్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు కానీ, సెకండ్ హాఫ్ మాత్రం కేవలం అజిత్ ఫ్యాన్స్ మాత్రమే చూడగలరు.
Also Read : 11వ రోజు చరిత్ర సృష్టించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే!
అయినప్పటికీ కూడా ఇంతటి డీసెంట్ బాక్స్ ఆఫీస్ రన్ ని సొంతం చేసుకుంటుందంటే అజిత్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ విశ్లేషకులు అందించిన సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 13వ రోజున 3 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే 12 వ రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. నిన్న PVR , ఐనాక్స్ వంటి స్క్రీన్ లో ఆఫర్ కారణంగా కేవలం 99 రూపాయలకే టికెట్ రేట్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో కలెక్షన్స్ బాగా పెరిగాయి. అనేక చోట్ల నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీలు కూడా నమోదు అయ్యాయి అట. అందుకే గ్రాస్ ముందు రోజుతో పోలిస్తే పెరిగింది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఆరు కోట్ల 10 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 227 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 111 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవడానికి ఇక కేవలం 5 కోట్లు మాత్రమే మిగిలింది. మరో రెండు మూడు రోజుల్లో ఆ మార్కుని కూడా అందుకొని క్లీన్ హిట్ అనిపించుకోనుంది ఈ చిత్రం. తమిళనాడు లో ఇప్పటి వరకు 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. ఇది అజిత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఓవర్సీస్ 61 కోట్ల రూపాయిల గ్రాస్, కర్ణాటక లో 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 250 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సూర్య రెట్రో సినిమా ఫ్లాప్ అయితే ఈ చిత్రానికి మరో వారం థియేట్రికల్ రన్ వచ్చే అవకాశం ఉంది.
Also Read : ‘డ్రాగన్’ ని అందుకోలేకపోయిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’..అజిత్ కి మరో అవమానం!