Bulliraju : లేటెస్ట్ గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లి రాజు పాత్రలో నటించిన ఒక బుడ్డోడికి మంచి గుర్తింపు వచ్చింది. తన నటనతో ఈ బుడతడు ప్రేక్షకులను బాగా నవ్వించాడు. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సంక్రాంతి బరిలో మూడు సినిమాలు నిలిచాయి. వీటిలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు వెంకటేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బుల్లి రాజు పాత్రలో ఒక బుడ్డోడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. బుల్లి రాజు పాత్రలో నటించిన ఆ బుడ్డోడి పేరు రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రేవంత్ హీరో వెంకటేష్ కు కొడుకుగా నటించాడు.
ఇటీవల ఈ బుడ్డోడు హీరో మహేష్ బాబును కూడా కలిశాడు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం కనిపిస్తుంది. మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో కూడా బుల్లి రాజుకు ఆఫర్ ఇవ్వనున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా ఈ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాలలో ఎక్కడ చూసిన బాగా వినిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంత ఉందో వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ కాంబినేషన్లో గతంలో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరో వెంకటేష్ మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలకు మంచి గుర్తింపు రాగా ముఖ్యంగా భాగ్యం పాత్రకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో భాగ్యం పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది.