Oscars 2024: గాడ్జిల్లా మైనస్ వన్’తో ఒక హిస్టరీ రిపీట్.. ఆస్కార్ గెలిచేంతగా ఇందులో ఏముంది?

ఆస్కార్ అవార్డుల వేడుకల్లో భాగంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గానూ ‘గాడ్జిల్లా మైనస్ వన్’ చిత్రానికి పురస్కారం లభించింది. విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు నిర్వహించిన తకాషి యమజాకీ ఈ చిత్రానికి రచన...

Written By: Swathi, Updated On : March 11, 2024 4:08 pm

Godzilla Minus One

Follow us on

Oscars 2024: యావత్ సినీ రంగం అంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 96వ ఆస్కార్ అవార్డు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ అవార్డుల వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆస్కార్ అవార్డుల వేడుకల్లో భాగంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గానూ ‘గాడ్జిల్లా మైనస్ వన్’ చిత్రానికి పురస్కారం లభించింది. విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు నిర్వహించిన తకాషి యమజాకీ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడం విశేషం. కాగా రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్ లో గాడ్జిల్లా ఏ విధంగా విధ్వంసం సృష్టించింది.. విధ్వంసానికి గురైన ప్రజలు తమ మనుగడ ఎలా సాగించారనే సారాంశంతో సినిమాను రూపొందించారు.

గాడ్జిల్లా మైనస్ వన్ లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణని చెప్పుకోవచ్చు. గాడ్జిల్లా ఫ్రాంచైజీ ఏడు దశాబ్దాల చరిత్రలో ఆస్కార్ అవార్డుకు కైవసం చేసుకోవడం మొదటిసారి అంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే గాడ్జిల్లా ఫ్రాంచైజీలో 37వ చిత్రంగా వచ్చిన దీనిలో ర్యునోసుకే కమికి, మినామి హమాబే, మునెతక అయోకి, సకురా ఆండో తదితరులు నటించారు.

ఈ కథను రాసేందుకు దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టగా.. విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ కియోకో షిబుయా నేతృత్వంలో ఈ చిత్రం రూపొందింది.