GOAT actress divya bharti childhood pic goes viral
Guess the Actress: సినీ హీరోయిన్ గా రాణించాలంటే మామూలు విషయం కాదు. అందంతో పాటు అభినయం ఉండాలి. కొన్ని సందర్భాల్లో గ్లామర్ షో చేయాలి. అయితే కొందరు చూడగానే నచ్చే విధంగా ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు. అలాంటి భామలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ కోవలోనే తమిళం ఇండస్ట్రీ నుంచి తెలుగు చిత్రసీమకు వచ్చిన ఓ హీరోయిన్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమెకు సంబంధించిన చిన్న నాటి పిక్ అలరిస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా?
సాధారణంగానే అందాలతో సినీ హీరోయిన్లు రచ్చ చేస్తారు. కానీ చక్కటి మోహంతో ఈ అమ్మాయి కుర్రకారును ఆకట్టుకుంటోంది. పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె త్వరలో ఓ మూవీతో అలరించబోతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? అందాల రాకుమారి దివ్యభారతి. ఈమె తమిళ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఆ తరువాత తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. త్వరలో సుడిగాలి సుధీర్ తో కలిసి ‘G.O.A.T’ అనే సినిమాతో రాబోతుంది.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి మొదట్లో సీరియల్స్ లో నటించిన దివ్యభారతి ఆ తరువాత ‘బ్యాచిలర్’ అనే మూవీతో వెండితెరపై కనిపించింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హద్దు, అదుపు లేకుండా గ్లామర్ షో చేయడంతో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. లిప్ లాక్ వంటి సీన్లలో నటించడానికి ఏమాత్రం అడ్డు చెప్పకపోవడంతో దివ్య భారతి పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. లేటేస్టుగా సుడిగాలి సుధీర్ తో కలిసి నటించబోతుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది దివ్య భారతి. లేటేస్టుగా చీరకట్టులో కనిపిస్తున్న దివ్యభారతిని చూసి యూత్ షాక్ అవుతున్నారు. డ్రెస్సులు వేసినా,చీరకట్టులోనైనా ఈ అమ్మడు అందం ఏమాత్రం తగ్గడం లేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు.