Globetrotter Event Rajamouli Speech: #Globetrotter(Varanasi Movie) ఈవెంట్ నిన్న అనుకున్నట్టు గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో వేలాది మంది అభిమానుల కేరింతల నడుమ ఎంతో గ్రాండ్ గా జరిగింది. కానీ ఈ ఈవెంట్ లో కొన్ని అంతరాయాలు ఏర్పడ్డాయి. అక్కడికి వచ్చిన అభిమానులందరికీ గ్లింప్స్ వీడియో కనపడడం కోసం 100 అడుగుల LED స్క్రీన్ ని ఏర్పాటు చేయించాడు రాజమౌళి(SS Rajamouli). అబ్బో ప్లానింగ్ అదిరిపోయింది, రాజమౌళి మార్క్ అని అంతా అనుకున్నారు. కానీ ఆ స్క్రీన్ పై వీడియో సరిగా ప్లే అవ్వలేదు. మధ్యలో చాలాసార్లు ఆగుతూ వచ్చింది. దీనిపై రాజమౌళి తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసాడు. టెక్నీకల్ టీం పై చిరాకు పడ్డాడు. ఇక ప్రసంగించడానికి వచ్చినప్పుడు ఏకంగా దేవుడిపైనే నోరు జారాడు. ఎంత పెద్ద దర్శకుడివి అయితే మాత్రం, కోట్లమంది సెంటిమెంట్ దెబ్బతినేలా మాట్లాడుతావా అని జనాలు రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడు అంటే ‘నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. మా నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనుక ఉంటాడు, ముందుకి నడిపిస్తాడు అన్నాడు, ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక స్నేహితుడు లాగా మాట్లాడుతూ ఉంటుంది, ఆమె మీద కూడా కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేది అని. సరే చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, నా చిన్నప్పటి నుండి రామాయణం అన్నా, మహాభారతం అన్నా ఎంతో ఇష్టం. ఇది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను కూడా. మహాభారతం తీయడం కూడా నా డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పాను, ఆలోచిస్తూ ఉన్నాను ఎలా తియ్యాలి అని. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణం లోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అసలు అనుకోలేదు’.
‘కానీ ఒకొక్క సన్నివేశం రాస్తుంటే, ఒకొక్క సీన్ ఊహించుకుంటూ ఉంటే, నేను నేల మీద నడవడం లేదు, ఎక్కడో గాల్లో నడుస్తున్నట్టు అనిపించింది. షూటింగ్ మొదటి రోజు మహేష్(Superstar Mahesh Babu) కి రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహేష్ కొంటెగా ఉంటాడు కాబట్టి, కృష్ణుడికి కరెక్ట్ గా సెట్ అవుతాడు, రాముడి లాంటి ప్రశాంతమైన క్యారక్టర్ కి మహేష్ సూట్ అవుతాడా అనే అనుమానం ఉండేది. అలాంటి సందిగ్ద పరిస్థితిలోనే ఫోటో షూట్ చేసాము. ఆ మొదటి ఫోటోని నిన్నటి వరకు వాల్ పేపర్ గా పెట్టుకున్నాను, మళ్లీ ఎవరైనా చూస్తారేమో అని తొలగించాను. ఈ ఎపిసోడ్ ని 60 రోజులు షూటింగ్ చేసాను. ప్రతీ రోజు ఒక ఛాలెంజ్ గానే అనిపించింది. ఈ ఎపిసోడ్ లో ఎన్నో సబ్ ఎపిసోడ్స్ ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో, ఈ క్రింది వీడియో లో చూడండి.
