Globe Trotter Event Rights: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద ఒక చెరగని ముద్ర వేసిన దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం దర్శకుడు కూడా తనే కావడం విశేషం… మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ను విలన్ గా పెట్టి ఆయన చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. రాజమౌళి ఈ సినిమా నుంచి ఒక్కో క్యారెక్టర్ లుక్ ను రిలీజ్ చేస్తున్నాడు. వారం కిందట పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను రిలీజ్ చేశాడు. ఇక గత కొద్దిసేపటి క్రితమే ప్రియాంక చోప్రా లుక్ ను రిలీజ్ చేశాడు. తను ఈ సినిమాలో ‘మందాకిని’ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా తన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెన్షన్ చేశాడు. ఆమె చేతిలో గన్ పట్టుకొని ఫైట్ చేస్తున్న ఒక డైనమిక్ లేడీగా ఆమె కనిపిస్తుండటం విశేషం…ఇక నవంబర్ 15వ తేదీన రామెజి ఫిలిం సిటీ లో #Globe Trotter పేరుతో ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నాడు. ఇక ఇందులో మహేష్ బాబు లుక్కుతో పాటు సినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఈ ఈవెంట్ కి ఏ మీడియా సంస్థ కి కూడా ఆహ్వానం లేదంటూ కరాకండిగా చెప్పేసాడు.
కారణం ఏంటి అంటే ఈ ఈవెంట్ మొత్తానికి 30 కోట్ల ఖర్చు వస్తుందట. కాబట్టి దానిని కూడా బిజినెస్ యాంగిల్ లో ఆలోచించిన రాజమౌళి ఈ ఈవెంట్ యొక్క రైట్స్ ని జియో హాట్ స్టార్ వాళ్ళకి 50 కోట్లకు అమ్మేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఈవెంట్ ను ప్రతి ఒక్కరు హాట్ స్టార్ లోనే చూడాలి… మొత్తాకైతే రాజమౌళి ఏది చేసినా కూడా బిజినెస్ యాంగిల్ లోనే ఆలోచిస్తుంటాడు.
అందువల్లే ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అతని సినిమాలు చేయడం వల్ల ప్రొడ్యూసర్ కి అంతో ఇంతో లాభం అయితే వస్తోంది. అంతే కానీ నష్టం వచ్చే పరిస్థితి లేదు. తను సినిమాని ఎంత డెడికేట్ తో చేస్తాడో దానికి ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లోనే చేసి భారీ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంటాడు…
ఇక మొత్తానికైతే ఆ ఈవెంట్ రైట్స్ ను కూడా ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మడం అనేది ఇదే మొదటిసారి… ఇండియాలో ఇప్పటివరకు ఇలాంటి ఒక ఈవెంట్ ను ఎవ్వరు చేయలేదు. ఏ ఓటీటీ సంస్థ కూడా ఆ ఈవెంట్ కు ఉన్న బజ్ ను వాడుకోవడానికి ఆ రైట్స్ ని కొనుగోలు చేయలేదు ఎంతైనా రాజమౌళి తెలివే తెలివి అంటూ సోషల్ మీడియాలో ఆయన గురించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి…