Bigg Boss Tamil 9: ప్రస్తుతం మన తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో, ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతానికి 10 వ వారం లోకి అడుగుపెట్టిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లోని కంటెస్టెంట్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. కొంతమంది డ్రామాలు ఆడుతున్నారు అని ప్రచారం చేసినప్పటికీ కూడా, కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం తో సూపర్ హిట్ సీజన్ గా నిల్చింది. ఓటీటీ లో కూడా మంచి వ్యూయర్ షిప్ తో కొనసాగుతోంది. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ షో లాగానే ఇతర భాషల్లో కూడా ఈ రియాలిటీ షో ఒకే సమయం లో రన్ అవుతోంది. మన దగ్గర 9 వ సీజన్ నడుస్తుంటే, తమిళం లో కూడా 9వ సీజన్ నడుస్తోంది. వరుసగా 7 సీజన్స్ కి కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
కానీ 8 వ సీజన్ నుండి విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక రీసెంట్ గానే మొదలైన 9వ సీజన్ కూడా మంచి రేటింగ్స్ తో నడుస్తోంది. ఇటీవలే కంటెస్టెంట్స్ మధ్య పెద్ద ఫైటింగ్ జరిగినట్టు సోషల్ మీడియా లో ఈ సీజన్ నుండి విడుదలైన ఒక వీడియో ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము. తీరా అది చూస్తే ప్రాంక్ అని తెలిసింది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియా లో వైరల్ అయినా మరో వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ సీజన్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న వారిలో ఒకరైన వీజే పార్వతి టాస్కు ఆడుతూ తీవ్రమైన గాయాలపాలైంది. వివరాల్లోకి వెళ్తే ఒక భారీ ఫిజికల్ టాస్క్ లో శబరి నాథ్ అనే కంటెస్టెంట్ తో తలపడిన పార్వతి కి, అనుకోకుండా అతని మోకాలు కంటికి బలంగా తగలడంతో కుప్పకూలిపోయిన పార్వతి బోరున ఏడ్చేసింది.
అంత పెద్ద గాయమైన తర్వాత కూడా ఆమె టాస్క్ ఆడేందుకు సిద్ధం అవ్వడం గమనార్హం. ఎక్కువ వారాలు గడిచే కొద్దీ హౌస్ లో కంటెస్టెంట్స్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి లోనే ఇలాంటి గాయాలు అవుతుంటాయి. ప్రస్తుతానికి పార్వతి ని మెడికల్ రూమ్ కి తరలించి మంచి చికిత్స అందించారు. ఆమె గురించి భయపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆమె టాస్కులు ఎలా ఆడబోతుందో చూడాలి.