యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ “రాధే శ్యామ్”. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.
Also Read: టీజర్ టాక్: లవర్ ఆనందం కోసం ‘పాగల్’ అయ్యాడు
అయితే.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే.. ఆ బడ్జెట్ స్థాయి ఎంత అనేది ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. అయితే.. ఫ్యాన్స్ టీజర్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తుండగా.. ఇటీవల టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది చూసిన తర్వాత.. ఈ చిత్ర వ్యయంపై అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు.
‘రాధేశ్యామ్’ గ్లింప్స్ స్టార్టింగ్ లో రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా.. ఈ సీన్‌లో కనిపించే రైల్వేస్టేషన్ సెట్ కోసం ఏకంగా రూ.1.6కోట్లు ఖర్చు పెట్టారట ప్రొడ్యూసర్స్. అయితే.. వాస్తవానికి ఈ సీన్‌ను ఇటలీలో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ.. కొవిడ్ ప్రభావంతో యూనిట్ విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో చేసేది లేక అన్నపూర్ణ స్టూడియోలోనే భారీ వ్యయంతో రైల్వే స్టేషన్ సెట్ వేశారు.
Also Read: జబర్దస్త్ ఆర్టిస్టుకు ఎన్టీఆర్ దండం.. వైరల్ అవుతున్న వీడియో!
ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సెట్ వేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. 23 మిలియన్ పైగానే వ్యూస్ వచ్చాయి. అయితే.. ఈ చిన్న సెట్ కోసమే అంత మొత్తం ఖర్చు చేస్తే.. మిగిలిన సినిమా మొత్తానికి ఎంత వెచ్చించి ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. త్వరలో మెయిన్ టీజర్ కూడా రిలీజ్ కాబోతోంది. మరి, అందులో ఎలాంటి విజువల్స్ ను చూపిస్తారో అని ఎక్సయిట్ అవుతున్నారు అభిమానులు.
మొత్తానికి యువీ క్రియేషన్స్.. ఎక్కడా తగ్గట్లేదనే విషయం అర్థమవుతోంది. మరి, సినిమాకు ఏ స్థాయిలో ఖర్చు పెట్టారనేది తెలియాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. జూలై 30న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్