https://oktelugu.com/

VK Naresh: నాకు తుపాకీ కావాలి… వారిని ఆశ్రయించిన నటుడు నరేష్

రమ్య ఆరోపణలకు నరేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నా ఫోన్ ట్యాప్ చేసింది. బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ సిద్ధం చేసింది. చంపించేందుకు తన మనుషులతో రెక్కీ చేయించింది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది. ఆమెకు డబ్బు పిచ్చి. బెంగుళూరు వెళ్లి అక్రమ సంబంధాలు పెట్టుకునేది. తాగుబోతు, తిరుగుబోతు అంటూ ఫైర్ అయ్యాడు. ఇటీవల మళ్ళీ పెళ్లి చిత్రం చేసి రమ్య క్యారెక్టర్ ని తప్పుగా చూపించాడు.

Written By:
  • Shiva
  • , Updated On : July 7, 2023 / 08:47 AM IST

    VK Naresh

    Follow us on

    VK Naresh: నటుడు నరేష్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. పాత్ర ఏదైనా జీవించేస్తాడు. వ్యక్తిగత జీవితంలో మాత్రం అన్నీ వివాదాలే. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్… నాలుగో పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు. నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి కాకున్నా పవిత్ర భార్య క్రిందే లెక్క. వీరి రిలేషన్ ని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు. రమ్య రఘుపతితో నరేష్ కి విడాకులు కాలేదు. ఆమె విడాకులు ఇవ్వనంటున్నారు. నరేష్ కావాలంటున్నాడు.

    ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆరోపణలు చోటు చేసుకున్నాయి. నరేష్ మీద రమ్య దారుణమైన అలిగేషన్స్ చేశారు. నరేష్ కి అమ్మాయిల పిచ్చి. నీలి చిత్రాలు చూస్తాడు. ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని దొరికిపోయాడు. నరేష్ వ్యసనాలు వాళ్ళ అమ్మ విజయనిర్మలకు కూడా తెలుసు. ఎప్పటికైనా మారతాడని నన్ను సముదాయించేది.. అని రమ్య రఘుపతి మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.

    రమ్య ఆరోపణలకు నరేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నా ఫోన్ ట్యాప్ చేసింది. బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ సిద్ధం చేసింది. చంపించేందుకు తన మనుషులతో రెక్కీ చేయించింది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది. ఆమెకు డబ్బు పిచ్చి. బెంగుళూరు వెళ్లి అక్రమ సంబంధాలు పెట్టుకునేది. తాగుబోతు, తిరుగుబోతు అంటూ ఫైర్ అయ్యాడు. ఇటీవల మళ్ళీ పెళ్లి చిత్రం చేసి రమ్య క్యారెక్టర్ ని తప్పుగా చూపించాడు.

    మూడో భార్యతో నరేష్ కి వివాదాలు నడుస్తుండగా ఆయన తుపాకీ లైసెన్సు కోసం పోలీస్ అధికారులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుట్టపర్తి జిల్లా ఎస్పీని కలిసిన నరేష్ తుపాకీ లైసెన్సు జారీ చేయాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని, ఆత్మ రక్షణ కోసం ఆయుధం కావాలని కోరారట. ఎస్పీ మాధవరెడ్డితో నరేష్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా రమ్య రఘుపతితో నరేష్ కి ఒక అబ్బాయి. నరేష్ కొడుకు తల్లి వద్దే పెరుగుతున్నాడు. నరేష్-పవిత్ర కలిసి జీవిస్తున్నారు.