Ghattamaneni Jayakrishna: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చారు. కానీ మహేష్ బాబు తప్ప ఎవ్వరూ క్లిక్ అవ్వలేదు. మహేష్ బాబు(Superstar Mahesh Babu) చిన్నతనం లో ఉన్నప్పుడు ఆయన అన్నయ్య రమేష్ బాబు సినిమాల్లోకి హీరోగా వెండితెర అరంగేట్రం చేసాడు. మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యింది, కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లు కూడా ఆ చిత్రానికి వచ్చాయి. కానీ ఎందుకో ఆ తర్వాత రమేష్ బాబు సినిమాలు కొన్ని బాగున్నప్పటికీ కూడా ఆడియన్స్ ఆదరించలేదు. ఇక మహేష్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రమేష్ బాబు సినిమాల నుండి పూర్తిగా తప్పుకొని, కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించేవాడు. మహేష్ బాబు తర్వాత ఆయన సోదరి మంజుల కూడా ఇండస్ట్రీ కి వచ్చింది, కానీ సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత బావమరిది సుధీర్ బాబు కూడా లాంచ్ అయ్యాడు, ఆయన కూడా ఫెయిల్యూర్ గానే నిలిచాడు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ కి హోస్ట్ గా వ్యవహరించడం పై బాలయ్య చివరి మాట ఇదే!
రెండేళ్ల క్రితం కృష్ణ అల్లుడి కొడుకు అశోక్ గల్లా కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసాడు, రెండు కూడా ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఇప్పుడు ఘట్టమనేని అభిమానుల ఎదురు చూపులు మొత్తం మహేష్ సోదరుడు రమేష్ బాబు కొడుకు ఎంట్రీ కోసమే. ఆయన పేరు ఘట్టమనేని జయ కృష్ణ(Ghattamaneni Jayakrishna). ఇప్పటికే సోషల్ మీడియా లో ఇతనికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు లాగా చాలా అందంగా ఉన్నాడని, ఇతనిలో యాక్షన్ టాలెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతాడని అంతా అంటున్నారు. అయితే ఇతని గ్రాండ్ ఎంట్రీ కి ముహూర్తం సిద్ధం అయ్యింది. #RX100 , మంగళవారం వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం లో జయకృష్ణ మొదటి సినిమా ఉండబోతున్నట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించబోతున్నాడు. అజయ్ భూపతి సినిమాలు ఎంత రా & రస్టిక్ గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చేలా సినిమాలను తీయడం లో దిట్ట. కానీ జయకృష్ణ చూస్తే చాలా సాఫ్ట్ కుర్రాడిలా అనిపిస్తున్నాడు, ఇతన్ని అజయ్ భూపతి తన స్టైల్ లో చూపించాలంటే కాస్త కష్టపడక తప్పదు. అజయ్ భూపతి సినిమాలు ఎలా ఉంటాయంటే ఆడియన్స్ కి నచ్చితే బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతాది, ఒకవేళ నచ్చకపోతే మాత్రం ‘మహాసముద్రం’ చిత్రానికి పట్టిన గతినే పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా రిస్క్ తో కూడుకున్న ప్రాజెక్ట్. చూడాలి మరి జయకృష్ణ ఎంత వరకు ఈ సినిమా ద్వారా సక్సెస్ అవుతాడు అనేది. ఘట్టమనేని కుటుంబం నుండి మరో మహేష్ బాబు లాంటి స్టార్ అవుతాడా లేదా?, మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో తెలపండి.