తెలుగు చిత్రసీమలో అల్లు ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. ఒక హాస్య నటుడిగా అల్లు రామలింగయ్య పాత్ర చాల చిన్నగా మొదలై.. నేడు తెలుగు ఇండస్ట్రీని ఎక్కువగా ప్రభావితం చేసే స్థాయికి తన కుటుంబాన్ని అల్లు రామలింగయ్య తీర్చిదిద్దటం గొప్ప విషయం.
అసలు కొన్ని దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలో ఒక ఫ్యామిలీ ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడం బహుశా అల్లు ఫ్యామిలీకి మాత్రమే దక్కిన ఘనత అనుకుంటా. ఇక అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ బడా నిర్మాతగా నేడు తనకంటూ ఒక సామ్రాజ్యన్ని సృష్టించుకున్నారు.
అలాగే, అల్లు అరవింద్ వారసులులో అల్లు అర్జున్ స్టార్ అయితే, అల్లు శీరీష్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక తాజాగా అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ సినిమాతో నిర్మాతగా చిత్ర సీమకి పరిచయం కాబోతున్నాడు. తన అన్నయ్య మొదటిసారి నిర్మాతగా చేస్తున్న సినిమా సెట్స్ కు వెళ్లాడు బన్నీ.
సెట్ లో గని టీమ్ తో ముచ్చటించి.. తన అన్నయ్య అల్లు బాబీతో ఓ ఫోటో దిగాడు. నేరుగా ఇంటికొచ్చి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఇది గర్వించదగిన క్షణం, ఫిలిం మేకర్‌గా అన్నయ్య జర్నీ సక్సెస్‌ఫుల్ గా సాగాలి అంటూ ఒక ఎమోషనల్ కామెంట్ పెట్టాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
In the sets of #Ghani . My best wishes to my brother @varunkonidela7 . He’s Killing it with his new avatar 🥊 . And my best wishes to director Kiran garu and the entire team . My love & wishes to both the new producers . pic.twitter.com/04UTVAWG1t
— Allu Arjun (@alluarjun) July 23, 2021
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ghani allu arjun emotional tweets on allu bobby goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com