Ghaati Overseas Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్న అతి కొద్ది మంది దర్శకులలో క్రిష్ జాగర్లమూడి ఒకరు… ఈయన చేసిన సినిమాలు తనకి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం ఆయన అనుష్కను పెట్టి ఘాటీ అనే సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఆల్రెడీ ఓవర్సీస్ లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: అనుష్క ‘ఘాటీ’ మూవీ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..క్రిష్ నుండి ఇలాంటివి ఊహించి ఉండరు
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే అడవి ప్రాంతంలోని ఒక తెగకు చెందినవారు గంజాయిని పండిస్తూ వాళ్ళ జీవనశైలిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్లు చేస్తున్న పని వల్ల ఎంతోమంది యూత్ గంజాయికి బానిసవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక ఇది తెలుసుకున్న శీలావతి (అనుష్క) ఏం చేసింది అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఒక సోషల్ మెసేజ్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ కథని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే ఆయన ఎంచుకున్న మార్గం కూడా చాలా వైలెంట్ గా ఉంది. మరి ఈ సినిమాలో కొంచెం వైలెన్స్ ఎక్కువైనప్పటికి ఎమోషన్స్ మాత్రం ప్రేక్షకుడిని హత్తుకునే విధంగా ఉన్నాయని ఓవర్సీస్ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు… ఇక దాంతో పాటుగా మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించిన కూడా ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది అనే వార్తలు కూడా వస్తున్నాయి. క్రిష్ చాలా రోజుల తర్వాత చేసిన సినిమా కాబట్టి ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి… ఇక ఫస్టాఫ్ లో వచ్చే గంజాయి సప్లై చేసే సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ లో హ్యూమన్ ఎమోషన్స్ తో కూడిన కొన్ని డైలాగులు అయితే ప్రతి ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించే విధంగా ఉన్నాయి… ఇక అనుష్క పర్ఫామెన్స్ అయితే చాలా బాగుంది…
ఆర్టిస్టుప పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అనుష్క ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపించింది. మొత్తానికైతే అనే ఒక్కరే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమాతో అనుష్క స్టామినా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసిందనే చెప్పాలి… బ్యాలెన్స్ సీన్స్ లో అనుష్క చాలా వైల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చింది… విక్రమ్ ప్రభు పర్ఫామెన్స్ కూడా ఒక అనిపించింది. అనుష్క కి సపోర్ట్ చేస్తూ ఆయన సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు…
ఇక చైతన్య రావు చాలా డీసెంట్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. తన క్యారెక్టర్ లో వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికి దాన్ని సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసి తన క్యారెక్టర్ కి ఒక ఆర్కనైతే క్రియేట్ చేసుకున్నాడు. జగపతిబాబు విషయంలో కూడా కేర్ ఫుల్ గా జాగ్రత్తలు తీసుకొని మరి తన క్యారెక్టర్ డిజైన్ చేశాడు. ఆయన కూడా చాలా అద్భుతంగా నటించాడు…ఇక వీళ్లతో పాటుగా మరికొంతమంది నటులు సైతం వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించకపోయిన కూడా ఈ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది… ఇక విజువల్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్ గా సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశారు… క్రిష్ ప్రతి సీన్ ను చాలా ఎఫెక్టివ్ గా చిత్రీకరించడంలో డీఓపీ వర్క్ చాలావరకు హెల్ప్ అయింది…
ప్లస్ పాయింట్స్
కథ
అనుష్క నటన
మైనస్ పాయింట్స్
సినిమా మొత్తం సీరియస్ గా ఉండటం…
సెకండాఫ్ లో బోరింగ్ సీన్స్…