Getup Srinu- Edukondalu: జబర్దస్త్ కామెడీ షో ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ప్రతి గురు, శుక్రవారాల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ల ద్వారా ప్రేక్షకులను నవ్వించే పని చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు జబర్దస్త్ ను చూస్తారంటే అతిశయోక్తి కాదు. అంతటి మహత్తర గుర్తింపు పొందిన కార్యక్రమం నేడు అస్తవ్యస్తంగా మారుతోంది. కామెడీ అంతగా పండటం లేదు. మొదట్లో పది రేటింగ్ వచ్చిన షో ప్రస్తుతం ఆరేడు రావడమే కష్టంగా ఉంటోంది. దీనికి కారణం ఉంది. జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్లు దూరం కావడమే. దీంతో కామెడీ షో కాస్త ట్రాజడీ షో గా మారిపోతోంది. కామెడీ కనిపించడం లేద

మొదట్లో టీం లీడర్లు చేసే షో లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్ర్తస్తుతం అంతగా ప్రాధాన్యం చూపడం లేదు. ప్రారంభం నుంచి ఉన్న కమెడియన్లు క్రమంగా దూరమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. చమ్మక్ చంద్ర, ఆర్పీ, అదిరే అభి, జడ్జిలు నాగబాబు, రోజా, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వారితోపాటు మేనేజర్ ఏడు కొండలు సైతం దూరమయ్యారు. దీంతో ప్రస్తుతం కామెడీ అంతగా రావడం లేదు. అందుకే ప్రేక్షకులు కూడా అంతగా పట్టించుకోవడం లేదు.
Also Read: Rajinikanth: షాకింగ్ : రజినీకాంత్ విషాద మాటలకు కన్నీళ్లు పెడుతున్న అభిమానులు
జబర్దస్త్ ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. వారిలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఉన్నారు. వీరి గురించి జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు సంచలన వ్యాఖ్యలు చేశారు. గెటప్ శ్రీనుకు తన కారు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో గెటప్ శ్రీను దానికి కూడా కౌంటర్ ఇచ్చాడు. తనకు కారు ఉచితంగా ఇవ్వలేదని అమ్మారని కుండబద్దలు కొట్టారు. దీంతో ఏడుకొండలుకు శ్రీను కౌంటర్ ఇచ్చినట్లు అయింది. జబర్దస్త్ యాజమాన్యం ఆర్టిస్టులను సమానంగా చూడటం లేదని రేగిన దుమారంతోనే ఆర్పీ బయటకు వచ్చాడు. తరువాత నాగబాబు, ఇప్పుడు అదిరే అభి, సుడిగాలి సుధీర్ లాంటి వారు కూడా బయటకు వచ్చేశారు. కానీ వారిని ఏడుకొండలు మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నా వారు మాత్రం రావడం కలే అని తెలుస్తోంది.

దీంతో జబర్దస్త్ షో ప్రస్తుతం ఆర్టిస్టులు లేని కామెడీ షో గా మారిపోతోంది. కామెడీ మచ్చుకైనా కనిపించడం లేదు సీనియర్ ఆర్టిస్టులు దూరమయ్యారు. కామెడీ పండటం లేదు. ఫలితంగా ప్రేక్షకులు కూడా ఆదరించడం లేదు. మొత్తానికి జబర్దస్త్ ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో జబర్దస్త్ కామెడీ షో మనుగడ కష్టాల్లో పడనుందని తెలుస్తోంది. ఇప్పటికైనా మల్లెమాల మేల్కొని కళాకారుల విషయంలో తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Thank You Movie Collections: ‘థాంక్యూ’ 3 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే ?
[…] Also Read: Getup Srinu- Edukondalu: జబర్ధస్త్ లొల్లి: ఏడుకొండలక… […]