https://oktelugu.com/

అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా – రష్మిక

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా రేంజ్ ఇప్పుడు నేషనల్‌ రేంజ్. కిరాక్‌ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంటున్న రష్మిక, ప్రస్తుతం హిందీ ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి నటిస్తోన్న ‘గుడ్ బాయ్’ సినిమా కోసం కూడా వరుస డేట్స్ ఇచ్చింది. అలాగే పుష్ప కోసం కూడా షూట్ కి […]

Written By: , Updated On : June 30, 2021 / 04:46 PM IST
Follow us on

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా రేంజ్ ఇప్పుడు నేషనల్‌ రేంజ్. కిరాక్‌ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంటున్న రష్మిక, ప్రస్తుతం హిందీ ‘మిషన్ మజ్ను’ సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి నటిస్తోన్న ‘గుడ్ బాయ్’ సినిమా కోసం కూడా వరుస డేట్స్ ఇచ్చింది.

అలాగే పుష్ప కోసం కూడా షూట్ కి రెడీ అవుతుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్ తో కాసేపు సరదగా ముచ్చట్లు పెట్టింది రష్మిక. మరి ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు రష్మిక తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. అయితే ఓ తుంటరి నెటిజన్ ‘మీరు స్మోక్‌ చేస్తారా?’ అని అడిగాడు.

ఈ చిలిపి ప్రశ్నకు రష్మిక డైరెక్ట్ ఎటాక్ ఇస్తూ ‘ఏమిటి నేనా..? స్మోకింగా ? అసలు నాకు స్మోకింగ్‌ అంటే అసహ్యం. నేను స్మోక్‌ చేస్తున్న వారి పక్కన నిలబడటానికి కూడా ఇష్టపడను’ అని చెప్పుకొచ్చింది. అలాగే మరో నెటిజన్‌ ఆశగా ‘మీరు నన్ను పెళ్లి చేసుకోండి’ అని మొహమాటం లేకుండా అడగ్గా.. ‘అయ్యో.. కనీసం ప్రపోజల్‌ అయినా మంచిగా చెయ్యొచ్చు కదా’ అంటూ ఈ క్యూట్ బ్యూటీ మూతి తిప్పుకుంది.

అంటే మంచిగా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారా ? అంటూ మరో నెటిజన్ ఆసక్తిగా అడిగినా, అతనికి ఆన్సర్ మాత్రం ఇవ్వలేదు రష్మిక. ఇక మరో నెటిజన్‌ ఒక అడుగు ముందుకేసి తెలివిగా.. ‘మీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి ?’ అని ప్రశ్నించాడు.

ఆ మాటకు రష్మిక సమాధానంగా ‘మంచి వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి అయి ఉండాలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించాలి’ అంటూ సినిమా డైలాగ్ లు చెప్పుకొచ్చింది. సామాన్య వ్యక్తిని కలవడానికి రష్మిక ఇష్టపడదు అని ఆమె గురించి తెలిసిన వారు కామెంట్స్ చేస్తుంటారు.