Genelia Viral Photos: తెలుగు ప్రేక్షకులు చిరస్థాయిగా గుర్తు పెట్టుకోగలిగే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు జెనీలియా(Genelia Deshmukh). ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘సత్యం’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. కానీ అంతకు ముందే ఈమె బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు లో ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది కానీ, బొమ్మరిల్లు చిత్రం మాత్రం ఈమెని తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరు తమ ఇంట్లో మనిషిలాగా స్వీకరించేలా చేసింది. అలా కెరీర్ పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్(Riteish Deshmukh) తో ప్రేమలో పడింది. మొదట్లో జెనీలియా ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదు కానీ, ఆ తర్వాత ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి 2012 వ సంవత్సరం లో అట్టహాసంగా హిందూ, మరాఠీ మరియు క్రైస్తవ పద్ధతుల్లో పెళ్లి చేశారు.
Also Read : స్టార్ హీరో దర్శకత్వంలో హృతిక్ రోషన్ కొత్త చిత్రం..పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా!
ఈ దంపతులిద్దరికీ రియాన్, రహీల్ అనే ఇద్దరు కుమారులు. ఇన్ స్టాగ్రామ్ లో జెనీలియా ఎప్పటికప్పుడు తనకు తన పిల్లలకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె మూడవసారి గర్భం దాల్చినట్టు స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. బేబీ బంప్ తో కనిపిస్తూ, వెనుక తన భర్త రితేష్ ప్రేమతో హత్తుకున్నా ఫోటో చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించింది. మూడవసారి తల్లి కాబోతున్నందుకు జెనీలియా కి అభిమానుల నుండి శుభాకాంక్షల వెల్లువ కురిసింది. జీవితాంతం ఇలాగే సుఖ సంతోషాలతో జీవించాలని ఆమెని ఈ సందర్భంగా ఆశీర్వదించారు. మరి జెనీలియా కి ఈసారి కూడా అబ్బాయి పుడుతాడా?, లేదా అమ్మాయి పుడుతుందా అనేది త్వరలోనే తెలియనుంది.
ఇదంతా పక్కన పెడితే జెనీలియా పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరమై మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది, పలు సూపర్ హిట్ సినిమాల్లో కూడా ఆమె నటించింది. తన భర్త తో కలిసి ఆమె తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘మజిలీ’ చిత్రం హిందీ రీమేక్ లో కూడా నటించిన భారీ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జెనీలియా ఇప్పుడు సడన్ గా బేబీ బంప్ తో కనిపించి ఫ్యాన్స్ కి మంచి సర్ప్రైజ్ ని అందించింది. ఇక భవిష్యత్తులో కూడా ఆమె సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి. ఇక రితేష్ దేశ్ ముఖ్ విషయానికి వస్తే ఒకప్పుడు ఈయన కామెడీ హీరో. ఆ తర్వాత ఎన్నో అబ్దుతమైన క్యారెక్టర్స్ చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే ఆయన ‘రైడ్ 2’ చిత్రం లో ప్రతినాయకుడి పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసాడు.