Genelia Emotional Video: మన తెలుగు ఆడియన్స్ కి అత్యంత దగ్గరైన హీరోయిన్స్ లో ఒకరు జెనీలియా(Genelia D’Souza). ఈమెని చూస్తున్నంతసేపు మన ఇంట్లోని అమ్మాయిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ‘బాయ్స్’ చిత్రం తో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మన టాలీవుడ్ లో ఢీ , రెడీ , బొమ్మరిల్లు, సత్యం , సై వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఈమె చివరిగా నటించిన డైరెక్ట్ తెలుగు చిత్రం ‘ఆరెంజ్’ . రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. అలా 2012 వరకు యాక్టీవ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన జెనీలియా , ఆ తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ళాడి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన జెనీలియా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. అయితే ఈమె కేవలం నటిగా మాత్రమే కాదు , నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. రీసెంట్ గానే ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘రాజా శివాజీ’ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తూ, అందులో హీరోయిన్ గా కూడా నటించింది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ చిత్రం గురించి రితేష్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఏ సినిమా కోసం ఆయన పడిన కష్టాన్ని, జెనీలియా అందించిన సహకారాన్ని , అదే విధంగా తన తండ్రిని తల్చుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. రితేష్ అలా భావోద్వేగానికి గురవ్వడం చూసి జెనీలియా కూడా కంటతడి పెట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.