Sneha Jain: సినీ లోకంలో నటీమణులకు ఎన్నో వేధింపులు ఉంటాయని ఇప్పటికే ఎందరో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ వేధింపులు కష్టాలు హీరోయిన్స్ జీవితాల్లో ఎక్కువగా ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి తీవ్రమైన సమస్యల బారిన పడి సినిమా రంగం నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా కొంతమంది బయటికొచ్చి తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ కష్టాలను బయటకు చెబుతూ.. కాస్టింగ్ కౌచ్ కి కారకులైన సినీ ప్రముఖుల పరువు తీస్తున్నారు.

కాగా తాజాగా యంగ్ బ్యూటీ స్నేహా జైన్ తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే ‘కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో ఓ సినిమా ఉంది. హీరోయిన్ కోసం చూస్తున్నారు అని నాకు తెలిసింది. నేను సినిమా టీమ్ ని ఫోన్ ద్వారా అప్రోచ్ అయ్యాను. నా ఫోటోలు, వివరాలను పంపించాను. అవి చూసి ఆ సినిమాలో నాకు అవకాశం ఇస్తానని ఓ సౌత్ డైరెక్టర్ చెప్పాడు.
అయితే, మళ్ళీ మరుసటి రోజు ఆ డైరెక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ రమ్మని ఆయన కోరాడు. ఈ క్రమంలోనే ఆ దర్శకుడు ఒక రోజంతా తనతోనే గడపాలని, దేనికైనా ఓకే చెప్పాలని చెప్పాడు. అతని మాటలు విని నేను తట్టుకోలేక పోయాను. నేను అలాంటివి చేయను అని చెప్పి కాల్ కట్ చేశాను. కానీ ఆ దర్శకుడు వదలలేదు. వారం తర్వాత మళ్లీ కాల్ చేశాడు.
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్ అంటూ, నువ్వు ఒప్పుకుంటే హీరోయిన్ ఆఫర్ ఇస్తాను అంటూ అతను చెప్పుకుంటూ పోయాడు. అయితే, అప్పటికే నాకు విపరీతమైన కోపం వచ్చింది. గట్టిగా అరచి ఫోన్ పెట్టేశాను’ అంటూ ఎమోషనల్ అవుతూనే చెప్పుకొచ్చింది స్నేహా జైన్. ఈ బ్యూటీ ప్రస్తుతం ‘సాత్ నిభానా సాథియా-2’ అనే సినిమాలో నటిస్తుంది. ఇంతకీ ఆ సౌత్ డైరెక్టర్ ఎవరో ?