Bigg Boss 6 Telugu- Geetu vs Baladitya: బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం లో లాగానే ఈ వారం కూడా నామినేషన్స్ హీట్ వాతావరణం లో కొనసాగిన సంగతి మన అందరికి తెలిసిందే..పోయిన వారం బిగ్ బాస్ హౌస్ నుండి సూర్య ఎలిమినేట్ అవ్వగా..ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి రేవంత్ , శ్రీ సత్య , ఇనాయ సుల్తానా, గీతూ, ఆది రెడ్డి , బాలాదిత్య, ఫైమా , కీర్తి, రోహిత్ మరియు మరీనా నామినేట్ అయ్యారు..వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్కు కూడా ఆసక్తికరంగా సాగనుంది..దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చెయ్యగా అది తెగ వైరల్ గా మారిపోయింది..బిగ్ బాస్ ఇచ్చిన ‘మిషన్ పాసిబుల్’ టాస్కులో ఇంటి సభ్యులందరు హోరాహోరీగా తలబడుతున్నారు..ఈ టాస్కులో ఇంటి సభ్యులు ‘రెడ్ స్క్వాడ్’ మరియు ‘బ్లూ స్క్వాడ్’ గా విడిపోవాలి..ఇరువురి స్క్వాడ్స్ లక్ష్యం వీలైనన్ని ఇతర స్క్వాడ్ సభ్యులను చంపడమే.
కాసేపు ఫన్ మరియు కాసేపు ఫైర్ మధ్య ఈ టాస్కు ఆసక్తికరంగా సాగింది..ఇనాయ సుల్తానా మరియు శ్రీ సత్య మధ్య మరోసారి వాగ్వివాదం చోటు చేసుకుంది..’ఆట ఆడడం నేర్చుకోండి’ అని ఇనాయ శ్రీ సత్య మీద అరవగా, అప్పుడు శ్రీ సత్య సమాధానం చెప్తూ ‘ఆట ఎలా ఆడాలో నువ్వు మాకు నేర్పించొద్దు అమ్మా..నేను నా స్నేహితుడిని కాపాడుకున్న..నీలాగా వెనుక నుండి పొడవలేదు’ అంటూ శ్రీ సత్య ఇనాయ కి కౌంటర్ ఇస్తుంది.

ఈ టాస్కుని కేవలం కండబలంతోనే కాదు బుద్ధిబలం తో కూడా ఆడాలి అని చెప్పడం తో ‘రెడ్ స్క్వాడ్’ టీం కి సంబంధించిన వారు..’బ్లూ స్క్వాడ్’ టీం సబ్యులకు సంబంధించిన కొన్ని వస్తువులను దొంగలించి దాచిపెడుతారు..ముఖ్యంగా బాలాదిత్య సిగరెట్లు మరియు లైటర్ ని దొంగలించి గీతూ కి ఇస్తారు ఆమె టీం మేట్స్..బాలాదిత్య లైటర్ మరియు సిగరెట్ కోసం గీతూ దగ్గరకి వెళ్లి దయచేసి అవి ఇచ్చేయండి అని బ్రతిమిలాడుతాడు.
అప్పుడు గీతూ ‘కచ్చితంగా ఇస్తాను..లైటర్ కోసం రెండు బ్లూ స్ట్రిప్పులు, మరియు సిగరెట్ కోసం నాలుగు బ్లూ స్ట్రిప్పులు ఇవ్వండి’ అని అంటుంది..అప్పుడు బాలాదిత్య ‘సిగరెట్ కోసం ఇంత దిగజారుతావా..ఆఫ్ట్రాల్ నాకు అది..నా టీం మేట్స్ నిన్ను నమ్మొద్దు నమ్మొద్దు అంటే నా చెల్లి లాంటి దానివని వెనకేసుకొచ్చాను’ అంటూ బోరున ఏడుస్తాడు బాలాదిత్య..ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
