Homeఎంటర్టైన్మెంట్Geetu Royal: బంపర్ ఆఫర్ కొట్టేసిన గీతూ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్

Geetu Royal: బంపర్ ఆఫర్ కొట్టేసిన గీతూ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్

Geetu Royal: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి తన మార్కు ఆటని చూపిస్తూ అశేష ప్రేక్షాదరణ దక్కించుకున్న గీతూ రాయల్ 9 వ వారం లో ఎలిమినేట్ అయిపోవడం ఎంతమందిని ఎమోషనల్ కి గురి చేసిందో మన అందరికి తెలిసిందే..మొదటి వారం నుండి హౌస్ లో టాస్కులు ఆడడంలో కానీ ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ గీతూ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది..కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే తన ఓవర్ కాంఫిడెన్స్..తానూ ఆడిందే ఆట అన్నట్టు ప్రవర్తించిన తీరు..అవతలి కంటెస్టెంట్స్ బలహీనతలతో ఆడుకోవడమే గీతూ ఎలిమినేషన్ కి ప్రధాన కారణం గా మారిన అంశాలు.

Geetu Royal
Geetu Royal

వీటిని కంట్రోల్ లో పెట్టుకొని ఉండుంటే ఆమె టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లో కచ్చితంగా ఉండేది..అయితే గీతూ బిగ్ బాస్ షో ని ఎంతో ప్రేమించింది..ఈ రియాలిటీ షో లో టైటిల్ ని సొంతం చేసుకుందామని వచ్చిన ఆమెకి కనీసం టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కూడా నిలబడలేకపోవడం ఆమెని మానసికంగా చాలా కృంగదీసింది.

కానీ బిగ్ బాస్ నుండే ఆమె అసలుసిసలు ప్రయాణం ప్రారంభమైనట్టు తెలుస్తుంది..ఆమెకి ఇప్పుడు సినిమాల్లో ఆఫర్లు వెల్లువలాగా కురుస్తున్నాయట..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రం లో ఒక కీలక పాత్ర లో నటించే అవకాశం ఇచ్చాడట హరీష్ శంకర్..పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడం అంటే మాములు విషయం కాదు..రోల్ క్లిక్ అయితే ఆమె ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు..అలాంటి స్థాయికి వెళ్తుంది..ఎందుకంటే గీతూ లో అంత టాలెంట్ ఉంది.

Geetu Royal
Geetu Royal

ఆమె కామెడీ టైమింగ్ మరియు చిత్తూరు యాసని డైరెక్టర్స్ ఇష్టమొచ్చినట్టు వాడుకోవచ్చు..ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప 2 లో కూడా మంచి రోల్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది..జబర్దస్త్ స్కిట్స్ మరియు రివ్యూస్ చెప్పుకునే గీతూ బిగ్ బాస్ షో ద్వారా అద్భుతమైన పాపులారిటీ ని దక్కించుకొని సినిమాల్లో బిజీ అవుతున్నందుకు ఆమె అభిమానులు చాలా సంతోషపడుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version