https://oktelugu.com/

Geetha Madhuri-Ashu Reddy: ఏక కాలంలో గీతా మాధురి-అషురెడ్డి ఒకే తరహా పోస్ట్స్… ఆందోళనలో ఫ్యాన్స్!

వ్యక్తిగతమైన, వృత్తి పరమైన అనేక విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. తాజాగా గీతామాధురి జీవితం విలువ, టైం గురించి ఒక కొటేషన్ పెట్టింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 2, 2024 / 04:58 PM IST

    Geetha Madhuri-Ashu Reddy same type of posts

    Follow us on

    Geetha Madhuri-Ashu Reddy: సూపర్ సింగర్ షో వేదికగా ఫేమ్ తెచ్చుకుంది గీతా మాధురి. తన టాలెంట్ తో స్టార్ సింగర్ అయ్యింది. ప్లే బ్యాక్ సింగర్ గా సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కించుకుంది. అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆమె టాలీవుడ్ కి అందించారు. సింగర్ గా ఫార్మ్ లో ఉన్నప్పుడే నటుడు నందు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సింగర్ గా ఎంతో మంది అభిమానం సొంతం చేసుకున్న గీతామాధురి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

    వ్యక్తిగతమైన, వృత్తి పరమైన అనేక విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. తాజాగా గీతామాధురి జీవితం విలువ, టైం గురించి ఒక కొటేషన్ పెట్టింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకుంది. ‘జీవితాన్ని ఎప్పుడూ కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు. ఇక్కడ మనం ఎప్పటి వరకు ఉంటామో తెలియదు .. అందుకే మనకున్నటువంటి ఈ సమయాన్ని విలువైన వాటి కోసం ఉపయోగించుకోవాలి తప్ప, అర్థం లేని వాటికి సమయం వృధా చేయకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది.
    అయితే ఇదే పోస్ట్ ను బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కూడా షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఒకే విధమైన కొటేషన్ ఇద్దరూ ఏక కాలంలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి వచ్చిన సమస్య ఏంటి? ఒకేసారి ఎందుకు స్పందించారనే ఆలోచనలో పడ్డారు.ఇక అషు రెడ్డి విషయానికి వస్తే ఆమె జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పాప్యులర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3 లో సైతం పార్టిసిపేట్ చేసింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. అషు రెడ్డి ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా మారిపోయింది. పలు వెబ్ సిరీస్, షాట్ ఫిలిమ్స్ చేస్తుంది.

    ఇక గీతామాధురి విషయానికొస్తే కేవలం సింగర్ మాత్రమే కాకుండా .. పలు సింగింగ్ షోలకు జడ్జి గా వ్యవహరిస్తుంది. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను. గీతా మాధురి భర్త నందు ఇటీవల యాంకర్ మారిన సంగతి తెలిసిందే. ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘ ఢీ ‘ డాన్స్ షో కు హోస్ట్ గా చేస్తున్నాడు. ప్రదీప్ స్థానంలో ఇప్పుడు నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నటుడిగా అతనికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల వధువు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించాడు.