https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఫ్యామిలీ వీక్ లో గౌతమ్ క్రేజ్ ని చూసి ఆశ్చర్యపోతున్న హౌస్ మేట్స్..పృథ్వీ అమ్మ మాటలకు అసూయతో రగిలిపోయిన నభీల్!

నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా ఇదే చెప్తుంది. గౌతమ్ జోలికి పోవద్దు, అతనితో నామినేషన్స్ పాయింట్స్ లో నువ్వు పోటీ గా నిలబడలేకపోతున్నావు, అందువల్ల అతనికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకి పెరిగిపోతుంది అని పరోక్షంగా హింట్స్ ఇచ్చేసింది. ఆమె వెళ్లినప్పటి నుండి నిఖిల్ గౌతమ్ తో చాలా స్నేహం గా ఉంటున్నాడు. అదే విధంగా పృథ్వీ వాళ్ళ అమ్మ కూడా హౌస్ లోకి వచ్చిన తర్వాత గౌతమ్ గేమ్ అదిరిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 08:38 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ‘గేమ్ చేంజర్’ గా నిలిచిపోయాడు. ఈయన రాక ముందు షో చాలా నీరసంగా సాగింది. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని సీజన్స్ లో ఆరవ సీజన్ పెద్ద ఫ్లాప్. మొదటి 5 వారాలు సీజన్ 8 ని చూసినప్పుడు కూడా ఆడియన్స్ కి అదే ఫీలింగ్ కలిగింది. ఇది సీజన్ 6 కంటే పెద్ద ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోపలకు అడుగుపెట్టిన తర్వాత సీజన్ కి పూర్వ వైభవం వచ్చింది. 8 మంది పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టగా, వారిలో గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి బలమైన ప్రభావం చూపించారు. ముఖ్యంగా గౌతమ్ అయితే టైటిల్ రేస్ లో ఉన్న నిఖిల్ ని వెనక్కి నెట్టి, తానే టైటిల్ కొట్టే రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించేసాడు.

    నిఖిల్ వాళ్ళ అమ్మ కూడా ఇదే చెప్తుంది. గౌతమ్ జోలికి పోవద్దు, అతనితో నామినేషన్స్ పాయింట్స్ లో నువ్వు పోటీ గా నిలబడలేకపోతున్నావు, అందువల్ల అతనికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకి పెరిగిపోతుంది అని పరోక్షంగా హింట్స్ ఇచ్చేసింది. ఆమె వెళ్లినప్పటి నుండి నిఖిల్ గౌతమ్ తో చాలా స్నేహం గా ఉంటున్నాడు. అదే విధంగా పృథ్వీ వాళ్ళ అమ్మ కూడా హౌస్ లోకి వచ్చిన తర్వాత గౌతమ్ గేమ్ అదిరిపోయింది. జనాలు బాగా నచ్చుతున్నారు అని చెప్పుకొచ్చింది. ఇది విన్న తర్వాత నభీల్ ముఖం మాడిపోయింది. యష్మీ తండ్రి కూడా గౌతమ్ ని పైకి ఎత్తేయడం తో, హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరికి గౌతమ్ క్రేజ్ మామూలుగా పెరగలేదు, టైటిల్ రేస్ లోకి వచేసాడు అనే విషయం అర్థమైపోయింది.

    కుటుంబసభ్యుల నుండి ఈ సూచనలు వచ్చినప్పటి నుండి గౌతమ్ తో ఇంటి సభ్యులు ప్రవర్తించే తీరులో మార్పులు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు శత్రువుగా ఉన్న నిఖిల్, నేడు మితృడైపోయాడు. అదే విధంగా నిన్న మొన్నటి వరకు స్నేహం గా ఉన్న నభీల్, వచ్చే వారం గౌతమ్ ని నామినేషన్స్ లో వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొన్న అర్థరాత్రి అవినాష్ తో నభీల్ మాట్లాడుతూ ‘గౌతమ్ ఆడియన్స్ ఓట్ల కోసం చాలా జిమ్మిక్స్ చేసి కంటెంట్ రప్పించుకుంటున్నాడు. సీతాఫలం విషయంలో కానీ, ప్రేరణ తో గొడవ విషయంలో కానీ, గౌతమ్ కావాలని కంటెంట్ కోసమే చేసాడు. ఇతని ఆటలను నేను అరికడుతాను. వచ్చే వారం నామినేషన్ వేస్తాను’ అని నభీల్ చెప్పుకొచ్చాడు.