https://oktelugu.com/

Matka Movie In OTT : విడుదలైన మొదటిరోజే ఓటీటీలోకి వరుణ్ తేజ్ ‘మట్కా’..? ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు!

ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. టీజర్, ట్రైలర్ వంటివి ఆసక్తిగా ఉండడంతో అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు నిర్మాత అడిగిన డబ్బులు ఇవ్వడానికి అంగీకరించారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 09:00 PM IST

    Matka Movie In OTT

    Follow us on

    Matka Movie In OTT :  మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనే రేంజ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం రాలేదు. కనీసం కోటి రూపాయిల షేర్ అయినా వస్తుందా అంటే అనుమానమే. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న అంచనా ప్రకారం ఈ చిత్రాన్ని సుమారుగా 50 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించారట. కానీ మేకర్స్ హైప్ ప్రొమోషన్స్ తో హైప్ ని తీసుకొని రావడంలో మాత్రం విఫలం అయ్యారు. సినిమా కలర్ థీమ్, జానర్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచలేకపోయాయి. అసలే ఈమధ్య వరుణ్ తేజ్ అన్ని నీరసపు సినిమాలు చేస్తున్నాడు, అసలు ఆసక్తి రావడం లేదు అనే ఫీలింగ్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉంది. అందుకే ఆయనకీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి.

    ఆయన చేస్తున్న ప్రయోగాత్మక చిత్రాలు విఫలం అవుతున్నప్పటికీ, అదే దారిలో వెళ్లి ఫ్లాప్స్ ని కొని తెచ్చుకుంటున్నాడు. కటౌట్ కి తగ్గ సినిమాలను వరుణ్ తేజ్ అసలు చేయడం లేదని, ఆయన కటౌట్ కి ‘గద్దలకొండ గణేష్’ లాంటి సినిమాలు చేస్తే అదిరిపోతుందని, కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదని మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ లో ఆయనకు ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్2, ఎఫ్3 వంటి భారీ హిట్స్ ఉన్నాయి. ఈ సినిమాల వల్ల వరుణ్ తేజ్ కి మంచి మార్కెట్ కూడా వచ్చింది. కానీ ఎందుకో ఆయన దానిని నిలబెట్టుకోవడం లో విఫలం అయ్యాడు. మట్కా చిత్రంలో కూడా వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అదరగొట్టాడు. కానీ ఆయన క్యాలిబర్ కి తగ్గ స్క్రిప్ట్ పడడం లేదని విశ్లేషకులు అంటున్నారు. వరుణ్ తేజ్ కి స్క్రిప్ట్ సెలక్షన్ లో సరైన గైడెన్స్ ఇవ్వాలని, పెద్ద రేంజ్ వెళ్లే టాలెంట్ అతనిలో ఉందని అంటున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. టీజర్, ట్రైలర్ వంటివి ఆసక్తిగా ఉండడంతో అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు నిర్మాత అడిగిన డబ్బులు ఇవ్వడానికి అంగీకరించారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట అమెజాన్ ప్రైమ్ సంస్థ. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లో, ప్రైమ్ లో అప్లోడ్ చేసుకునేందుకు అనుమతి ఉంది. అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినిమాకి థియేట్రికల్ షేర్ అసలు రావడం లేదు కాబట్టి డిసెంబర్ కంటే ముందే ఓటీటీలోకి రావొచ్చు అని కూడా అంటున్నారు.