Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 రసవత్తరంగా సాగుతుంది. కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చాడు. శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు. అయితే గౌతమ్ కృష్ణకు నాగార్జున సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్ కి పంపించాడు. దాదాపు 36 గంటలు గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ఇక నామినేషన్స్ డే నాడు గౌతమ్ కృష్ణ సడన్ ఎంట్రీ ఇచ్చాడు.
గౌతమ్ రాకను చూసి కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. తేరుకున్నాక గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడని అర్థం చేసుకున్నారు. గౌతమ్ కృష్ణ మాత్రం తనకు అర్హత లేదని బయటకు పంపిన కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో గౌతమ్-తేజా ఇద్దరు మిగిలారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యత హౌస్ మేట్స్ కి ఇచ్చాడు నాగార్జున. ఏడుగురు హౌస్ మేట్స్ లో సందీప్ మినహాయించి అందరు గౌతమ్ ఎలిమినేట్ కావాలని కోరుకున్నారు.
ఒక్క సందీప్ మాత్రమే తేజా ఎలిమినేట్ కావాలని ఓటు వేశాడు. తాను ఎలిమినేట్ కావాలని ఓటు వేసిన వాళ్లలో శివాజీ కూడా ఉన్నాడు. నామినేషన్స్ లో శివాజీని గౌతమ్ టార్గెట్ చేశాడు. నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేనని అన్నావు. ప్యాంటు విప్పుకుని తిరగడమే ఎంటర్టైన్మెంటా? అని గౌతమ్ శివాజీని ప్రశ్నించాడు. నేను బట్టలు లేకుండా 90 సినిమాలు చేశాను. నేను ఆర్టిస్ట్ ఏదైనా చేస్తా అని శివాజీ కౌంటర్ ఇచ్చాడు.
కాగా గౌతమ్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఒకరిని నేరుగా నామినేట్ చేయవచ్చని చెప్పాడు. గౌతమ్ చెప్పిన ఆ కంటెస్టెంట్ ఈ వారానికి నేరుగా నామినేట్ అవుతాడు. శివాజీ మీద కోపంగా ఉన్న గౌతమ్ అతన్ని నామినేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హౌస్లో 14 మంది ఉన్నారు. అంబటి అర్జున్, నయని పావని, శ్వేత, భోలే షావలి, పూజా మూర్తి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చారు.
Welcome to the brand-new era of Bigg Boss – Season 2.0! Expect the unexpected as contestants receive a special power to nominate anyone for eviction this week.📢🏠#BiggBossTelugu7 #Starmaa @iamnagarjuna @DisneyPlusHSTel
Link: https://t.co/3SBDhzQP6T— Starmaa (@StarMaa) October 10, 2023