Gautham Vs Akhira Vs Nandamuri Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త జనరేషన్ హీరోలు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మెగా, ఘట్టమనేని, నందమూరి ఫ్యామిలీ నుంచి కొంతమంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరానందన్, అలాగే మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ, నందమూరి బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ, ఇక నందమూరి జానకిరామ్ కొడుకు అయిన బుడ్డ ఎన్టీఆర్ లాంటి నటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఎవరు ఇండస్ట్రీని శాసించి స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకుంటారు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళందరు ఒకటి, రెండు సంవత్సరాల్లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళలో ఎవరు టాప్ పొజిషన్ ని అందుకొని ఇండస్ట్రీకి ‘టార్చ్ బేరర్’ గా మారి ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అనే దానిమీద కొన్ని అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. ఇక ఇప్పటికే అఖిరా కి పవన్ కళ్యాణ్ కొడుకుగా చాలా మంచి క్రేజ్ ఉంది. ఒక్క సినిమా చేయకుండానే అతనికి స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది.
మరి దానికి తగ్గట్టుగానే ఇక మీదట చేయబోతున్న సినిమాలతో ఆయన స్టార్ హీరోగా రాణిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక గౌతమ్ కృష్ణ సైతం వన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన నటన లో మెలుకువలు నేర్చుకుంటూ వస్తున్నాడు. తొందరలోనే హీరోగా ఇంట్రడ్యూస్ అయి స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నాడు…
ఇక బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ సైతం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నప్పటికి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమాకుడ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన సక్సెస్ సాధిస్తాడా? లేదా అనే డైలమాలో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక జానకిరామ్ కొడుకు అయిన బుడ్డ ఎన్టీఆర్ హీరో మెటీరియల్ గా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న ఈయన ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తాడు అనేది ఇప్పుడు కీలకంగా మారింది…ఇక వీళ్లలో ఎవ్వరు టాప్ లెవల్ కి వెళ్తారు…30 సంవత్సరాల ఒకసారి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళే ‘టార్చ్ బేరర్’ ఎవరవుతారు అనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…