Homeఎంటర్టైన్మెంట్Garikapati- Natu Natu Song: ‘నాటు నాటు’పై గరికపాటి హాట్ కామెంట్స్.. వైరల్..

Garikapati- Natu Natu Song: ‘నాటు నాటు’పై గరికపాటి హాట్ కామెంట్స్.. వైరల్..

Garikapati- Natu Natu Song
Garikapati- Natu Natu Song

Garikapati- Natu Natu Song: రాజమౌళి రచించిన ‘ఆర్ఆర్ఆర్’ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ బరిలో నిలవడంతో ప్రతీ తెలుగు సినీ ప్రేమికుడు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ తరుణంలో రాజమౌళి టీంకు ప్రపంచంలో ఉన్న తెలుగువారి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త, శతావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు ‘నాటు నాటు’ సాంగ్ పై కామెంట్స్ చేశారు. సాధారణంగా గరికపాటి నరసింహారావు సినిమా నటులపై గతంలో సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నాడో చూద్దాం..

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అంతేకాకుండా త్వరలో నిర్వహించే ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో ‘నాటు నాటు’ సాంగ్ ను సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లు లైవ్ లో పాడి వినిపించే అవకాశం దక్కించుకున్నారు. దీంతో ఈ సాంగ్ రచించిన వారి నుంచి మ్యూజిక్ కంపోజ్ చేసిన కీరవాణి వరకు ప్రతి ఒక్కరు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే తాజాగా గరికపాటి స్పందనపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే..

ఆయన ఈ సాంగ్ ను బాగా మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ నాటు నాటు సాంగ్ గురించి అందరూ అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ సాంగ్ ను నేను వినలేదు. ఇప్పుడు విన్నాను. ఈ పాటను నాకే తెలియకుండా రిపీట్ చేస్తూ అరగంటపాటు విన్నాను. ఈ సాంగ్ ను రచించిన చంద్రబోస్ చక్కని తెలుగు పదాలతో కూర్పు చేశారని అన్నారు. తెలుగు భాష నుంచి పుట్టిన నాటు సాంగ్ అస్కార్ వరకు వెళ్లడం అభినందనీయమని అన్నారు.

Garikapati- Natu Natu Song
Garikapati- Natu Natu Song

ఇక ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లో చాలా చక్కగా నృత్యం చేశారని అన్నారు. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు కూడా ఇలా ఒకేలాగా డ్యాన్స్ చేయడం కష్టమని అన్నారు. కానీ వీళ్లు మాత్రం అలాంటి లోటు లేకుండా అద్భుతంగా డ్యాన్ష్ చేయడం అందరినీ ఆకట్టుకున్నారని అన్నారు. ఇలా గరికపాటి నాటు నాటు సాంగ్ పై ప్రశంసలు కురిపించిన మాటలు సోషల్ మీడియాలోకి రావడంతో అవి వైరల్ గా మారాయి. సాధారణంగా గరికపాటి సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ నాటు నాటు సాంగ్ పై ప్రశంసలు కురిపించడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular