https://oktelugu.com/

Gangs Of Godavari Teaser Review: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రివ్యూ: విశ్వక్ సేన్ నయా అవతార్, హైలెట్ అదే!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విలేజ్ పొలిటికల్ డ్రామా. అలాగే పీరియాడిక్ స్టోరీ అనిపిస్తుంది. 80లలో గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగిన కథ.

Written By:
  • Shiva
  • , Updated On : July 31, 2023 / 04:08 PM IST

    Gangs Of Godavari Teaser Review

    Follow us on

    Gangs Of Godavari Teaser Review: జయాపజయాలతో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఆయన గత చిత్రం దాస్ కా ధమ్కీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతగా కూడా విశ్వక్ వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై సపోర్ట్ ఇచ్చారు. కాగా విశ్వక్ సేన్ 11వ చిత్రంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరకెక్కుతుంది. ఈ మూవీ టైటిల్ టీజర్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా ఆసక్తి రేపే విధంగా టైటిల్ టీజర్ ఉంది.

    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విలేజ్ పొలిటికల్ డ్రామా. అలాగే పీరియాడిక్ స్టోరీ అనిపిస్తుంది. 80లలో గోదావరి పరివాహక ప్రాంతంలో జరిగిన కథ. మొత్తంగా ఇసుక మాఫియా చుట్టూ నడుస్తుందనిపిస్తుంది. విశ్వక్ మాస్ లుక్ ఆకట్టుకుంది. ‘అన్నాయ్ మేము గోదారోళ్ళం మాట ఒక్కటే సాగదీస్తాం కానీ తేడా వస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం’ అని విశ్వక్ చెప్పిన డైలాగ్ బాగుంది. అయితే అతని డైలాగ్ లో గోదావరి యాస్ మాత్రం వినిపించలేదు.

    తెలంగాణా యాక్సెంట్ లో చెప్పినట్లు ఉంది. డిజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్ నటిస్తున్నారు. టీజర్లో వీరిద్దరినీ పరిచయం చేశారు. అంజలి లుక్ ఆసక్తి రేపింది. కథలో ఆమెది బలమైన పాత్ర అనిపిస్తుంది. అంజలిది బోల్డ్ రోల్ కూడా కావచ్చు. అలాగే సాయి కుమార్, నాజర్ వంటి సీనియర్ నటులు భాగమయ్యారు. విజువల్స్ ఆకట్టుకున్నాయి.

    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ టీజర్ మొత్తంగా అంచనాలకు మించి ఉంది. టైటిల్ కూడా డిఫరెంట్ గా ఎంచుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీతో విశ్వక్ సేన్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు కృష్ణ చైతన్య విశ్వక్ ని కొత్తగా ప్రజెంట్ చేయనున్నాడు. డిసెంబర్ లో విడుదల కానుంది.