Gandhi Tatha Chettu Movie Review : పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు. సుకృతి వేణి. ఈమె తొలిసారిగా గాంధీ తాత చెట్టు చిత్రంలో నటిస్తోంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఇది ఎలా ఉందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
గాంధీ తాత చెట్టు సినిమా పై హైప్ తక్కువగా ఉన్నప్పటికీ, అర్థవంతమైన సందేశంతో తీశారు. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నంగా చెప్పొచ్చు. సుకృతి వేణి ఆకట్టుకునే అరంగేట్రం చిత్రంలో హైలైట్‌గా నిలుస్తుంది. అయితే మూవీ స్లో నారేషన్, ప్రిడిక్‌బిలిటీ , ఎమోషనల్ డెప్త్ లేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు.
అవార్డు గెలుచుకున్న చిత్రం అహింస , పర్యావరణ పరిరక్షణ గురించి గొప్ప సందేశాన్ని అందించినప్పటికీ, ఇది వాణిజ్యపరంగా కమర్షియల్ గా విజయం సాధించకపోవచ్చు అయితే చిత్రంలోని సామాజిక సందేశం అందరి హృదయాలను గెలుచుకోవడం ఖాయం.
సినిమా ఎలా ఉందో రివ్యూ వీడియోలో తెలుసుకుందాం..
