Gandeevadhari Arjuna Collections: మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.గాండీవదారి అర్జున మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. గాండీవధారి అర్జున వరుణ్ తేజ్ కెరీర్ లోయస్ట్ ఫిగర్స్ నమోదు చేసింది. నైజాంలో కేవలం రూ. 60 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక ఆంధ్రా విషయానికి వస్తే రూ. 65 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
సీడెడ్ లో రూ. 15 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఏపీ/తెలంగాణాలలో కలిపి రూ.1.40 కోట్ల గ్రాస్, రూ. 75 లక్షల షేర్ రాబట్టింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ. 50 లక్షల గ్రాస్ అందుకుంది. వరల్డ్ వైడ్ గాండీవధారి అర్జున మూవీ రూ. 1.90 కోట్ల గ్రాస్, రూ. 1 కోటి షేర్ వసూలు చేసింది. ఒక టైర్ టూ హీరో సినిమా కనీసం రెండు కోట్ల షేర్ అందుకోలేకపోయింది.
గాండీవధారి అర్జున మూవీ వరల్డ్ వైడ్ రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వరుణ్ తేజ్ బాక్సాఫీస్ బరిలో దిగారు. ఫస్ట్ డే వసూళ్లు చూశాక ఇది అసాధ్యమే అనిపిస్తుంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే అతి తక్కువ ఓపెనింగ్ డే వసూళ్లు గాండీవధారి అర్జున నమోదు చేసింది.
గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ బాడీగార్డ్ రోల్ చేశారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. నాజర్ కీలక రోల్ చేశారు. కథ రీత్యా అధిక భాగం లండన్ లో షూట్ చేశారు. దాని వలన చిత్ర బడ్జెట్ కొంచెం ఎక్కువైందని వరుణ్ తేజ్ అన్నారు. ఆ రిచ్ నెస్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. సాంకేతికంగా ఉన్నతంగా మూవీ ఉంది. మేకింగ్ చాలా స్టైలిష్ గా ఉందని అంటున్నారు.