
‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ ఎన్టీఆర్ ప్రేక్షకులను పిలుస్తున్నాడు. తారక్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఆగస్ట్ నుంచి ప్రసారం కానుంది కాబట్టి.. ఈ షో టీజర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మొత్తానికి ఈ టీజర్ లో ఈ షో కాన్సెప్ట్ ను పర్ఫెక్ట్ గా రివీల్ చేశారు.
ముఖ్యంగా ఈ కరోనా సమయంలో సామాన్యులు పడిన కష్టాలను చాలా బాగా చూపించారు. పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితులతో పాటు ప్రైవేటు కాలేజీ లెక్చరర్ ల పరిస్థితి ఎలా ఉంది లాంటి అంశాలను కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. పాఠాలు చెప్పే లెక్చరర్ జాబ్ పోయి, దోశ బండి పెట్టుకోవడం లాంటి అంశాలను కూడా బాగా చూపించారు.
https://www.youtube.com/watch?v=akF45nJzDaQ&t=90s
మొత్తానికి బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి తారక్ రెడీ అయ్యాడు అన్నమాట. బిగ్ బాస్ 1 తోనే తెలుగు బుల్లితెరకు టీఆర్పీని సునామీలా పెంచేసిన ఎన్టీఆర్, మళ్ళీ బుల్లితెర పై అలాంటి సునామీని క్రియేట్ చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. సహజంగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు అనగానే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో పై అంచనాలు భారీగా పెరిగాయి.
హిందీలో బాగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు వర్షన్ లో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి గతంలో ఈ షోకి హోస్ట్ గా పని చేశారు. అయితే ఏకంగా చిరంజీవినే హోస్ట్ గా చేసినా ఈ షోకి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే, ఈ సారి తెలుగు వెర్షన్ కి రేటింగ్స్ రావాలనే కసితో జెమిని టీవీ తారక్ ను రంగంలోకి దించింది. ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో ఈ షో పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.