
దర్శక ధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న చెక్కుతున్న RRR పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ గోల లేకపోతే.. అక్టోబరు 13న రిలీజ్ అయ్యేదే. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పుడు విడులవుతుందో కూడా తెలియదు. కాబట్టి.. మహేష్-జక్కన్న సినిమా కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని గతేడాడి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పటి నుంచీ.. రాజమౌళి మహేష్ ను ఎలా చూపించబోతున్నాడు అనే చర్చ మొదలు పెట్టారు. ప్రిన్స్ అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ ఆసక్తి ఉంది. జక్కన్న టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి, మహేష్ లాంటి స్టార్ ను ఆయన ఏ క్యారెక్టర్లో చూపించబోతున్నాడు? కథ ఏంటీ? అన్న విషయాలు అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి
అయితే.. జక్కన్న మరోసారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ నే ఎంచుకుంటున్నాడని, శివాజీ కథను సినిమాగా మలచబోతున్నాడని, ఛత్రపతి శివాజీగా మహేష్ ను చూపించబోతున్నాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని టాపిక్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అఫీషియల్ గా ఓ విషయాన్ని ఆడియన్స్ తో పంచుకున్నారు.
‘మహేష్ బాబుతో సినిమా కోసం కథ రెడీ చేయాలని ఒకసారి రాజమౌళి నా దగ్గరకు వచ్చి కథ కావాలని అడిగాడని.. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండాలని చెప్పాడని’ విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్. అదింకా స్క్రిప్ట్ దగ్గరే ఉందని చెప్పారు. తానూ, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం అని.. ఆయన పుస్తకాల ఆధారంగా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నా అని విజయేంద్ర ప్రసాద్ సంచలన విషయాలు వెల్లడించారు. దీంతో.. మహేష్ బాబు జంగల్ హీరోగా ఉండబోతున్నాడనే విషయం దాదాపుగా కన్ఫామ్ అయ్యినట్టేనని అంటున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమంటే.. ఈ మూవీ మల్టీస్టారర్ గా ఉండబోతోందనే న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. మరి, ఆ హీరో ఎవరు? అంటే.. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోను తీసుకుంటారని అంటున్నారు. త్వరలో మహేష్ బాబు బర్త్ డే ఉన్న నేపథ్యంలో.. ఆ రోజున ఈ విషయాన్ని రివీల్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.