https://oktelugu.com/

Game Changer Trailer : గేమ్ చేంజర్ ట్రైలర్ లో ఇవే హైలెట్ కానున్నాయా..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక రేంజ్ లో ముందుకు తీసుకెళ్తుంది. ఇక రానున్న రోజుల్లో మరింత భారీ రేంజ్ లో మన సినిమాలు పెను సంచలనాలను క్రియేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్న మన సినిమాలను చూసి బాలీవుడ్ హీరోలు సైతం భయపడిపోతున్నారు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మన స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు పెను ప్రభంజనాలను సృష్టించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 1, 2025 / 09:49 PM IST

    Game Changer Trailer

    Follow us on

    Game Changer Trailer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పటివరకు వాళ్లు సాధించిన విజయాలు ఒకేత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగాలి అంటే మాత్రం మన హీరోలు భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక పుష్ప 2 సినిమాతో ఇప్పటికే భారీ రికార్డులను కొల్లగొడుతు ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ తెలుగు సినిమా స్థాయిని పెంచాడనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో యావత్ తెలుగు సినిమా స్థాయిని మరొక రేంజ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో ఈ మూవీ ట్రైలర్ సైతం ఈరోజు రావలసింది.

    కానీ అనుకోని కారణాల వల్ల ట్రైలర్ ను రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ చేసిన రెండు పాత్రలను రివిల్ చేసి ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయనే విషయాన్ని ఈ ట్రైలర్ లో చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక దాంతో పాటుగా ఒక యాక్షన్ సీక్వెన్స్ లోని కొన్ని షాట్స్ ను కూడా ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఉండే కెమిస్ట్రీని కూడా ఈ ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలూస్తోంది. ఇక ఇవి ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలువబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా శంకర్ సినిమా అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలకు తగ్గకుండా ఈ సినిమాని చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది…

    ఇక ఈ సినిమాని చూసిన సుకుమార్ చెప్పిన మాటలను బట్టి వింటుంటే ఈ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడికి హైప్ అయితే విపరీతంగా పెరుగుతూ పోతుంది. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ప్రేక్షకులందరి చేత పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…