https://oktelugu.com/

Breaking News: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్..ప్రభుత్వానికి కోలుకోలేని షాక్!

లాయర్ రామారావు దాఖలు చేసిన పిటీషన్ ని విచారించిన కమీషన్ సభ్యులు, నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ జితేందర్ కి ఆదేశాలు జారీ చేసారు. దీనికి డీజీపీ నుండి ఎలాంటి రియాక్షన్ రాబోతుందో చూడాలి. ఇప్పటికే ఈ ఘటన పై పోలీసులు అల్లు అర్జున్ తప్పు ఉన్నట్టుగా చూపిస్తూ పది నిమిషాల వీడియో ఫుటేజీ ని విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 09:59 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun ; Breaking News: సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లో ఎన్ని ట్విస్టులు వస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా మరో ట్విస్టు నెలకొంది. ఆరోజు రాత్రి జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు విపరీతమైన లాఠీ ఛార్జ్ చెయ్యాల్సి వచ్చింది. ఈ ఘటన కారణంగా కాస్త అలజడి రేగింది. అయితే దీనిపై న్హర్క్(నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్) కమిషన్ చాలా ఘాటుగా రియాక్షన్ ఇస్తూ లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు లాయర్ రామారావు దాఖలు చేసిన పిటీషన్ ని విచారించిన కమీషన్ సభ్యులు, నాలుగు వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీ జితేందర్ కి ఆదేశాలు జారీ చేసారు. దీనికి డీజీపీ నుండి ఎలాంటి రియాక్షన్ రాబోతుందో చూడాలి. ఇప్పటికే ఈ ఘటన పై పోలీసులు అల్లు అర్జున్ తప్పు ఉన్నట్టుగా చూపిస్తూ పది నిమిషాల వీడియో ఫుటేజీ ని విడుదల చేసారు.

    అయితే ఆరోజు పోలీసులు కూడా హద్దులు దాటి అక్కడికి వచ్చిన అభిమానులపై లాఠీ ఛార్జ్ చేసినట్టు లాయర్ రామారావు ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలతో సహా ఆయన కమిషన్ కి అందచేయగా, కమీషన్ చాలా తీవ్ర స్థాయిలో పోలీసుల తీరుపై మండిపడింది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరి డీజీపీ తక్షణమే పోలీసులపై చర్యలు తీసుకుంటారా?, లేదా వాళ్ళ వెర్షన్ ని వినిపించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. వాస్తవానికి ఆరోజు అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలిసిన వెంటనే వేల సంఖ్యలో అభిమానులు సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు.

    ఆ సమయంలో పరిస్థితులు అదుపు తప్పడం వల్ల కంట్రోల్ చేయడం కోసం లాఠీ ఛార్జ్ చేయక తప్పదు కదా, అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే కదా ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ ప్రభుత్వ మద్దతుదారులు కూడా తమ వెర్షన్ ని వినిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా మొత్తం ఒక టీం గా పని చేసినప్పుడు, ఇలాంటి ఘటన జరిగినప్పుడు కూడా టీం గా కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్లంతా అల్లు అర్జున్ పైకి నెట్టేసి ఒంటరి వాడిని చేసారు, రేవతి గారు చనిపోయినప్పుడు, వాళ్ళ ఇంటికి పుష్ప టీం వెళ్లి అండగా ఉన్నాము అని చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.