Jailor 2 : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ సత్తా ని మరోసారి కోట్లాది మంది మూవీ లవర్స్ కి తెలిసేలా చేసిన చిత్రాలలో ఒకటి ‘జైలర్’. ఈ చిత్రానికి ముందు రజినీకాంత్ కబాలి, కాలా, పెద్దన్న ఇలా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో అభిమానులను నిరాశపరిచాడు. మధ్యలో వచ్చిన ‘పేట’ యావరేజ్ గా ఆడినప్పటికీ, అభిమానులు ఒక్కసారి సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గ సినిమా పడాలని బలంగా కోరుకున్నారు. అలాంటి సమయంలోనే ‘జైలర్’ చిత్రం వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామీ మామూలుది కాదు. ఏకంగా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కేవలం తెలుగు వెర్షన్ నుండే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
థియేటర్స్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. సుమారుగా సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో లో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాకి సీక్వెల్ ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు. న్యూ ఇయర్ కి ప్రోమో వీడియో ని విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు. కానీ రేపు ఈ సినిమాకి సంబంధించిన 4 నిమిషాల 30 సెకండ్ల ప్రోమో విడుదల కాబోతుంది. కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో ఈ ప్రోమో ని ప్లే చేయబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు కానీ, కేవలం ప్రోమో కి సంబంధించిన షూటింగ్ మాత్రం డిసెంబర్ నెలలోనే పూర్తి చేసారు. ఈ ప్రోమోతో సినిమా కాన్సెప్ట్ ఏమిటి అనేది చెప్పబోతున్నాడు డైరెక్టర్.
రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘జైలర్’ మొదటి భాగం లో రజినీకాంత్ తప్పు మార్గం లో వెళ్తున్న తన కొడుకుని కూడా చంపేస్తాడు. మరి పార్ట్ 2 లో ఆయన క్యారక్టర్ ని ఎలా తీర్చి దిద్దబోతున్నారు అనేది ఆసక్తికరమైన అంశం. క్లైమాక్స్ లో విలన్ చనిపోయేముందు, నన్ను చంపితే ఈ మాఫియా మొత్తం ఆగిపోతుంది అనుకోకు, చాలా చిక్కుల్లో పడుతావు, ఇది పెద్ద నెట్వర్క్ అని అంటాడు. ఎక్కడి నుండి ఈ సినిమా ఆగిపోయిందో అక్కడి నుండే ఈ చిత్రం మొదలు కాబోతుంది. వర్మ (విలన్) ని చంపినందుకు గాను ఆ మాఫియా పై నుండి వచ్చే వాళ్ళతో రజినీకాంత్ ఢీ కొట్టాలి. మొదటి పార్ట్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, అదే విధంగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ అతి పాత్రల్లో కనిపించారు. కానీ పార్ట్ 2 లో పూర్తి స్థాయి రోల్స్ చేసే అవకాశం ఉంది.