https://oktelugu.com/

Game Changer: గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కి ఈ సంవత్సరం మోక్షం దక్కుతుందా..?

చిరంజీవి లాంటి నటుడు ఇండస్ట్రీకి చేసిన సేవల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి వాళ్ల ఫ్యామిలీ నుంచి ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు...వాళ్ళందరూ వాళ్ల సినిమాల ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల బిజినెస్ జరిగేలా చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 3, 2024 / 01:18 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. అందుకే రామ్ చరణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. తండ్రికి తగ్గ తనయుడుగా పేరును సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ పోటీని ఇస్తూ గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలైతే దక్కాయి. ఇక దాంతో ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా పైనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా మీద తను దాదాపు రెండు సంవత్సరాల నుంచి తన డేట్స్ మొత్తాన్ని కేటాయిస్తున్నాడు. శంకర్ మాత్రం భారతీయుడు 2 సినిమా మీద ఫోకస్ పెట్టి ఆ సినిమా చేశాడు. ఇక గత నెలలో రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు…అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మీద తన పూర్తి ఫోకస్ ను పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అవడంతో శంకర్ కి మార్కెట్ పరంగా భారీగా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ రామ్ చరణ్ సినిమా కావడం వల్ల ఈ సినిమాకి మార్కెట్ పరంగా అయితే పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. రామ్ చరణ్ ఈ సినిమాతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబడటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా దాదాపు 500 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా రామ్ చరణ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడం కూడా విశేషం…ఇక మొన్నటి దాకా భారతీయుడు 2 సినిమా వల్ల డిలే అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్టు చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం లో శంకర్ ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కి రెడీ అవ్వబోతుంది అంటూ మేకర్స్ అయితే కొన్ని హింట్లైతే ఇస్తున్నారు. కానీ అఫీషియల్ గా ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వడం లేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు కూడా ఈ సినిమా ప్రస్థవన వచ్చిన ప్రతిసారి దాటవేస్తున్నాడు. కానీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేకపోతున్నాడు. ఒకవేళ రిలీజ్ డేట్ చెప్పినా కూడా నామా మాత్రంగా ఆరోజు రావచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చెప్తున్నారు. కానీ క్లారిటీగా మాత్రం ఎవరూ చెప్పడం లేదు.

    మరి ఈ సంవత్సరంలో అయిన రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందా లేదా అని తన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో జూనియర్ ఎన్టీఆర్, డిసెంబర్ మొదటి వారంలో అల్లు అర్జున్ థియేటర్లోకి వస్తున్నారు. కాబట్టి రామ్ చరణ్ కూడా థియేటర్ లోకి వస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…