Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మెగా అభిమానులకు ఈ చిత్రం ఒక పీడకల లాంటిది. #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ఇలా చతికల పడడం అనేది దురదృష్టకరం. సినిమా పర్వాలేదు, యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ, టాక్ మాత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి వచ్చినట్టు వచ్చింది. వీటికి తోడు ఈ సినిమాకి సంబంధించిన HD ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవ్వడంతో అనేక మంది బాగలేని సినిమాని థియేటర్ కి వెళ్లి ఏమి చూస్తాంలే, మంచి ప్రింట్ వచ్చింది ఇంట్లోనే కూర్చొని చూద్దాం అనే తరహాలో తయారైంది పరిస్థితి. దీని ప్రభావం వసూళ్లపై మామూలు రేంజ్ లో పడలేదు.
అయితే హిందీ లో మాత్రం ఈ సినిమాకి డీసెంట్ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి. అక్కడి ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు 42 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. శనివారం రోజు కోటి రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. దానికి ముందు రోజున ఈ సినిమాకి కేవలం 60 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఆ ప్రాంతం లో ఈ చిత్రానికి రిపబ్లిక్ డే వరకు థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉందట. అదే కనుక జరిగితే ఈ సినిమాకి ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ కి ఇవి ఏ మాత్రం సరిపోవు. వంద కోట్ల రూపాయిల గ్రాస్, 80 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను ఈ చిత్రం అందుకోవాల్సి ఉంటుంది.
అది దాదాపుగా అసాధ్యం. కానీ బాలీవుడ్ ఆడియన్స్ కి తగ్గట్టుగా ఈ చిత్రంలో ఎలాంటి హంగులు లేకపోయినా, అక్కడి ఆడియన్స్ ఇంత దూరం ఈ చిత్రాన్ని తీసుకొచ్చారంటే, అందుకు కారణం రామ్ చరణ్ క్రేజ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒకప్పుడు ఈ రేంజ్ వసూళ్లు మన స్టార్ హీరోకి కి వస్తే సూపర్ హిట్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే వసూళ్లు వస్తే డిజాస్టర్ అంటున్నాం. దీనిని బట్టి మన టాలీవుడ్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మన స్టార్ హీరోలు ఆ మార్కెట్ ని ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి భవిష్యత్తులో రాబోయే సినిమాలైనా మన మార్కెట్ ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాయో లేదో అనేది.