https://oktelugu.com/

Naga Chaitanya Tandel  Movie : నాగ చైతన్య ‘తండేల్’ చిత్రం ఆ కథకి రీమేకా..? ఫ్యాన్స్ ని భలే మోసం చేశారుగా..క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్!

ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కథ 'మున్నీటి గీతలు' అనే నవల ఆధారంగా తెరకెక్కుతోందని సోషల్ మీడియా లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం సాగింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 10:15 PM IST

    Naga Chaitanya Tandel  Movie

    Follow us on

    Naga Chaitanya Tandel  Movie :  వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన అక్కినేని నాగ చైతన్య, ఇప్పుడు ఆయన తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సుమారుగా 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఈయన నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ అనే చిత్రం చేసాడు. విడుదలకు ముందు భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా, విడుదల తర్వాత డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత చందు మొండేటి ‘కార్తికేయ 2’ తో భారీ హిట్ ని అందుకొని సక్సెస్ స్ట్రీక్ లోకి అడుగుపెట్టాడు. ముందుగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, అప్పటికే డేట్స్ మొత్తం టాప్ హీరోల సినిమాలు బుక్ చేసుకోవడంతో ఫిబ్రవరి 7వ తారీఖున విడుదల చేస్తున్నట్టు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ద్వారా అధికారిక ప్రకటన చేసాడు.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కథ ‘మున్నీటి గీతలు’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతోందని సోషల్ మీడియా లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం సాగింది. దీనిపై అల్లు అరవింద్ స్పందిస్తూ ‘ఈ చిత్ర కథ ని మేము 2020 వ సంవత్సరం లోనే సిద్ధం చేసాం. శ్రీకాకుళం లోని మత్స్యకారుల నిజ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని మా డైరెక్టర్ చందు మొండేటి ఈ కథని సిద్ధం చేసాడు. అయితే ఇదే కథతో 2022 వ సంవత్సరంలో రచయిత శ్రీనివాసరావు ‘మున్నీటి గీతలు’ అనే నవల రాశాడు. ఆయనకు వెంటనే నోటీసులు జారీ చేసాము. అప్పుడు ఆయన నా కథకి, మీ కథకి చాలా తేడా ఉంది. కానీ నేపథ్యం ఒకటే, పబ్లిక్ డొమైన్ మీద ఇలాంటి కథలు ఎన్నైనా రాసుకోవచ్చు కదా అని ఆయన చెప్పడంతో మేము కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇది ఇలా ఉండగా ‘మున్నీటి గీతలు’ నవలకు సంబంధించిన రైట్స్ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు క్రిష్ వద్ద ఉన్నాయి. ఆయన ఈ కథతో ఒక వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉండగా, అల్లు అరవింద్ క్రిష్ వద్దకు వెళ్లి, వాస్తవాలను వివరించి ప్రస్తుతానికి ఆ వెబ్ సిరీస్ ని ఆపించాడట. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఈ నవల కథతో వెబ్ సిరీస్ తీసే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ క్రిష్. ఇదంతా చూసిన తర్వాత కచ్చితంగా ఈ కథలో చాలా బలం ఉండే ఉంటుందని, నాగ చైతన్య ని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అవుతుందని అక్కినేని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు.