Geetu Royal- Pushpa 2: టాలెంట్ ఉండి గుర్తింపు లేని వాళ్లకు బిగ్ బాస్ షో మంచి ఫ్లాట్ ఫార్మ్. టైటిల్ తో సంబంధం లేకుండా షోలో పాల్గొన్న చాలా మందికి లైఫ్ వచ్చింది. రోజుల తరబడి బుల్లితెరపై కనిపించడం, షోలో తమ క్యారెక్టర్ ని ఆవిష్కరించడం ద్వారా ఆడియన్స్ కి దగ్గరవుతారు. అదే సమయంలో అభిమానులను సంపాదించుకుంటారు. వారి పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు ఆఫర్స్ ఇస్తాయి. బుల్లితెర షోస్ లో సందడి చేసే అవకాశం దక్కుతుంది. సక్సెస్ కొడితే లైఫ్ మారిపోతుంది. ఓ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. 9వ వారం ఎలిమినేటైన గీతూ దశ తిరిగింది అంటున్నారు.

గీతూకు పుష్ప 2 లో ఆఫర్ వచ్చిందన్న ప్రచారం జరుగుంది. పుష్ప మూవీ నేపథ్యం చిత్తూరు. హీరో అల్లు అర్జున్ తో పాటు దాదాపు అన్ని క్యారెక్టర్స్ అదే యాసలో మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒక పాత్ర కోసం గీతూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారట. ఈ విషయంపై గీతూ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. పుష్ప 2 చిత్ర కో డైరెక్టర్ నా ఫోన్ నెంబర్ అడిగారని తెలిసిందని గీతూ వెల్లడించారు. షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉండగా.. గీతూకి రోల్ దక్కే అవకాశాలు కొట్టిపారేయలేం.
ఆమె యూట్యూబ్ ఛానల్ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలిమినేషన్ బాధను వెళ్లగక్కుతూ గీతూ చేసిన వీడియో వైరల్ గా మారింది. గంటకు పైగా ఉన్న ఆ వీడియోను 5 లక్షల మందికి పైగా చూశారు. హౌస్లో గీతూ నెగిటివిటీ మూటగట్టుకున్నప్పటికీ అమితంగా అభిమానించే ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు. ఆమె ఆటిట్యూడ్, రౌడీ నేచర్ ని ఇష్టపడ్డవారు లేకపోలేదు. ఈ క్రమంలో గీతూ వీడియోలు, ఇంటర్వ్యూలను విపరీతంగా ఫాలో అవుతున్నారు.

కోరుకున్న బిగ్ బాస్ టైటిల్ దక్కకున్నా… గీతూ కెరీర్లో సెటిల్ కావడం ఖాయమనిపిస్తుంది. ఆమె సినిమాల్లో, బుల్లితెర షోల్లో బిజీ అయ్యే సూచనలు కలవు. ఎటూ డబ్బులు సంపాదించే తన యూట్యూబ్ ఛానల్ ఉంది. కాగా పొలిటీషియన్ కావడం గీతూ రాయల్ లక్ష్యమట. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటుందట. గీతూ రాయల్ కోరికలు నెరవేరాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.