Gaddar Film Awards : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) కి ఉత్తమ నటీనటులు, దర్శకులను ఎంపిక చేశారు. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన అవార్డ్స్ ని కూడా ఎంపిక చేశారు.
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు(NTR National Award) :
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పురస్కారం ని అందించబోతున్నట్టు జ్యూరీ సభ్యులు తెలియజేసారు. 5 దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి, ఇప్పటికీ కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకున్న బాలయ్య ఈ అవార్డు అని అందుకోవడానికి అర్హుడు. రీసెంట్ గానే ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు తో సత్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ అరుదైన పురస్కారం తో ఆయనకు గౌరవం దక్కడం పట్ల నందమూరి అభిమానులు హర్షిస్తున్నారు.
పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు:
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మణిరత్నం(Maniratnam) కి పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుని ప్రకటించారు. రీసెంట్ గానే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఆయన జూన్ 4 వ తేదీన కమల్ హాసన్ తో చేసిన ‘థగ్ లైఫ్’ చిత్రం విడుదల కాబోతుంది.
BN రెడ్డి ఫిల్మ్ అవార్డు :
సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకులకు తన ప్రతీ సినిమాతో అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కల్గించిన సుకుమార్(Sukumar) కి BN రెడ్డి ఫిల్మ్ అవార్డు ని ప్రకటించారు. రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్ రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ఆ చిత్రం తర్వాత ఆయన తీసిన పుష్ప సిరీస్ దేశం లోనే సంచలనాలు నెలకొల్పాయి. అలా ఆడియన్స్ లో తనదైన ముద్ర వేసిన సుకుమార్ కి, మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపజేసినా ఈయనకు ఇలాంటి అవార్డు రావడం ఉచితమే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాంతారావు ఫిల్మ్ అవార్డు:
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కేవలం రెండు మూడు సినిమాలతోనే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ని ఈ అవార్డుకి ఎంచుకున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతం నుండి వచ్చి ఇండస్ట్రీ లో హీరోగా సక్సెస్ అవ్వడం కేవలం విజయ్ దేవరకొండ విషయం లోనే జరిగింది. అందుకే ఆయనకు ఈ ప్రత్యేక పురస్కారం అందిస్తున్నట్టు తెలుస్తుంది.
అదే విధంగా నాగి రెడ్డి & చక్రపాణి ఫిల్మ్ అవార్డ్స్ కి అట్లూరి పూర్ణ చంద్రరావు ని ఎంపిక చేయగా,రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు కి యండమూరి వీరేంద్రనాథ్ ని ఎంపిక చేశారు. అంతే కాకుండా 2014 వ సంవత్సరం నుండి 2023 వ సంవత్సరం వరకు ఉత్తమ చిత్రాలను కూడా గద్దర్ అవార్డ్స్ కి ఎంపిక చేస్తూ కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా తెలిపారు.