Gaddar Awards 2025 Balakrishna: మొన్న అల్లు అర్జున్(Icon Star Allu Arjun)..నేడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)..రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేర్లను మర్చిపోయారు. ఇది వాళ్ళ అభిమానులకు ఎలివేషన్స్ వేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ, రాష్ట్రాన్ని పాలించే వాళ్ళను, తమకు గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళను మర్చిపోవడం అనేది ముమ్మాటికీ వాళ్ళ గౌరవాన్ని తగ్గించడమే. అప్పట్లో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుండి ఎన్ని అనుమతులు కావాలో, అన్ని అనుమతులను ఇచ్చారు. ఆ సినిమాకి తెలంగాణ ప్రాంతం లో అనితర సాధ్యమైన కలెక్షన్స్ వచ్చాయంటే అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అలా అన్ని విధాలుగా సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేరు ని అల్లు అర్జున్ అప్పట్లో సక్సెస్ మీట్ లో మర్చిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక నిన్న హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం చేత ‘గద్దర్ అవార్డ్స్’ ఈవెంట్ ఎంత వైభవంగా జరిపారో మన అందరికీ తెలిసిందే.
ఈ వేడుక లో నందమూరి బాలకృష్ణ కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రధానం చేశారు. అనంతరం ఆయన ప్రసంగం ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి పేరు వరకు కరెక్ట్ గా పలికి కృతఙ్ఞతలు తెలియజేశాడు కానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేరుని మాత్రం ఆయన మర్చిపోయాడు. ఒకసారి అల్లు అని, మరొకసారి మల్లు అని, ఆ తర్వాత ఆయన పేరుని గుర్తు తెచ్చుకోవడం కోసం ఒక క్షణం గ్యాప్ ఇచ్చి మల్లు భట్టి విక్రమార్క అని సంభోదించాడు. పాపం బాలయ్య తన పేరు ని మర్చిపోవడం తో భట్టి విక్రమార్క కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నవ్వి ఊరుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన వైపు ‘ఏంటి ఇదంతా’ అన్నట్టుగా చూసాడు. ఇలా మర్చిపోవడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. అంత ఖర్చు చేసి, వేలాది మందిని పిలిపించి గౌరవాన్ని ఇచ్చే నాయకుల పేర్లను స్టేజి ఎక్కే ముందు ఒకటికి పదిసార్లు కంఠస్తం చేసుకొని అయినా ఎక్కాలి కదా.
సీఎం, డిప్యూటీ సీఎం పేర్లను మర్చిపోవడం వల్ల వాళ్ళ స్థాయి ఏమాత్రం తగ్గిపోదు, కానీ ఎదుట వారి దృష్టిలో తగ్గించిన వారే తగ్గిపోతారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బాలయ్య సంగతి అందరికీ తెలిసిందే, వేదిక పై ఆయన ప్రసంగాలు అంత ఆకర్షణీయంగా ఉండవని, పేర్లు నిజంగానే ఆయన ఉద్దేశపూర్వకంగా మర్చిపోయి ఉండదని, ఆ క్షణం లో టక్కుమని గుర్తుకు వచ్చి ఉండకపోవచ్చని అంటున్నారు. కానీ ఒక విషయం లో బాలయ్య ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రేవంత్ రెడ్డి తన కంటే చిన్నవాడు అయినప్పటికీ, రేవంత్ అన్నా అని బాలయ్య సంభోదించాడు. తెలంగాణ లో అందరూ రేవంత్ అన్నా అని వయస్సుతో సంబంధం లేకుండా పిలుస్తుంటారు. ఆ గౌరవం బాలయ్య రేవంత్ రెడ్డి కి ఇచ్చాడని కొనియాడుతున్నారు.
భట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/OMKPh0GUeo
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025