Gabbar Singh Re Release Collection: అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ‘మురారి’ వసూళ్లను దాటేసిన ‘గబ్బర్ సింగ్’.. ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతో తెలుసా!

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో మొదలయ్యాయి. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది అంటున్నారు.

Written By: Vicky, Updated On : August 30, 2024 3:48 pm

Gabbar Singh Re Release

Follow us on

Gabbar Singh Re Release Collection: సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద పండుగ. ఆయన పుట్టినరోజు అవ్వడంతో అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు చేస్తూ, సంబరాలు చేసుకుంటారు. అయితే ఈమధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ రాజ్యం ఏలుతుండడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈసారి ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటికీ రీ రిలీజ్ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ పేరిట జల్సా, ఖుషి చిత్రాలు ఆల్ టైం రికార్డ్స్ గా ఉన్నాయి. ఇప్పుడు గబ్బర్ సింగ్ తో ముచ్చటగా మూడవసారి ఆల్ టైం రికార్డు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘మురారి’ చిత్రం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది.

ఇప్పుడు ఈ రికార్డుని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో మొదలయ్యాయి. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది అంటున్నారు. విడుదలకు మూడు రోజుల ముందు ఈ రేంజ్ ఉండడం చిన్న విషయం కాదు. మురారి చిత్రం విడుదలకు ఒక్క రోజు ముందు 3 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది. కానీ ‘గబ్బర్ సింగ్’ చిత్రం మూడు రోజులకు ముందే ఈ స్థాయి ట్రెండ్ చూపించడంతో మొదటి రోజు కచ్చితంగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చరిత్ర సృష్టించినట్టే.

ఎందుకంటే సోమవారం నాడు విడుదలైన ఒక రీ రిలీజ్ చిత్రానికి కొత్త సినిమాకి కూడా సాధ్యం కానటువంటి రికార్డుని పెట్టారంటే, ఇక వీకెండ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే ఏ స్థాయి రికార్డ్స్ ఉండేవో అర్థం చేసుకోవచ్చు. పని దినం అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ఆరాధ్య దైవం పై చూపిస్తున్న ఈ అభిమానాన్ని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ‘మురారి’ రికార్డుని అయితే కచ్చితంగా కొట్టేస్తుంది అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది, కానీ ఆల్ టైం ఇండియన్ రికార్డుని బద్దలు కొడుతుందా అనేది చూడాలి. తమిళ హీరో విజయ్ నటించిన ‘గిల్లీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డుని గబ్బర్ సింగ్ కొట్టడం చాలావరకు కష్టమే, కానీ ఒకవేళ కొడితే మాత్రం వండర్ అంటూ ట్రేడ్ పండితులు కామెంట్స్ చేస్తున్నారు.