Gabbar Singh Re Release: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ తారాస్థాయికి చేరిపోయింది. అభిమానులు, ప్రేక్షకులు కొత్తగా విడుదలయ్యే సినిమాలకంటే ఎక్కువగా, ఈ రిలీజ్ చిత్రాలపైనే అమితాసక్తిని చూపిస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘మురారి’ చిత్రానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పెట్టారో మనమంతా చూసాము. అలాగే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘ఇంద్ర’ చిత్రాన్ని కూడా విశేషంగా ఆదరించారు. మొదటి రోజే ఏకంగా మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఇంద్ర, రెండవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మురారి రికార్డుని బద్దలు కొట్టలేకపోయింది ‘ఇంద్ర’. ఇప్పుడు అందరి చూపు ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ వైపే ఉంది. సెప్టెంబర్ 2 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని గ్రాండ్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలైంది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి అక్కడి ట్రేడ్ వర్గాలకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. సినిమా విడుదలకు ఇంకా 8 రోజుల సమయం ఉన్నప్పటికీ, ఈ చిత్రం అప్పుడే 15 వేల డాలర్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. చాలా రీ రిలీజ్ చిత్రాలకు విడుదల ముందు రోజుకి కూడా ఈ స్థాయి బుకింగ్స్ లేవు. అలాంటిది గబ్బర్ సింగ్ చిత్రానికి 8 రోజుల ముందు ఈ స్థాయి గ్రాస్ వచ్చిందంటే, కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు నార్త్ అమెరికా నుండి లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ రీ రిలీజ్ చిత్రానికి కూడా ఈ స్థాయి వసూళ్లు రాలేదు. ట్రెండ్ చూస్తూ ఉంటే లక్ష డాలర్లు మాత్రమే కాదు, రెండు లక్షల డాలర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. అలాగే ఆస్ట్రేలియా లో కూడా ఈ చిత్రానికి 8 రోజుల ముందే మూడు వేల డాలర్లు వచ్చాయి. విడుదల రోజుకి 10 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
సోమవారం రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. ఇక లండన్ ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై 24 గంటలైంది. ఈ 24 గంటల్లో ఈ చిత్రానికి 4 షోస్ నుండి 250 కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇంద్ర చిత్రానికి విడుదలకు ముందు రోజు వరకు ఒక వెయ్యి 500 టిక్కెట్లు అమ్ముడుపోగా, గబ్బర్ సింగ్ ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే కేవలం ఓవర్సీస్ ప్రాంతం నుండి ఈ సినిమా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.