క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. రాజేంద్ర ప్రసాద్ – శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ.. మంచి అంచనాలతో రిలీజైంది. ఈ మూవీకి స్క్రీన్ ప్లే కూడా అనిల్ అందించడంతోపాటు అన్నీతానై చూసుకోవడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ.. ప్రేక్షకులను ఆకర్షించడంలో మాత్రం ఈ సినిమా దారుణంగా విఫలమైపోయింది. మొదటి ఆటకే నెగెటివ్ టాక్ రావడం.. అది వేగంగా స్ప్రెడ్ అవడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.
Also Read: విజయానికి ‘శ్రీకారం’ చుట్టలేదు.. బాక్సాఫీస్ బాకీ చాలా ఉంది!
తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మొదటి రోజునే చాలా థియేటర్ల నుంచి ఈ సినిమాను పక్కన బెట్టారు. ఈ సినిమాతోపాటు రిలీజ్ అయిన జాతిరత్నాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం, శ్రీకారం కూడా పోటీగా ఉండడంతో కలెక్షన్ల పరంగా గట్టి దెబ్బతిన్నాడు గాలి సంపత్.
కాగా.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మాత్రం గట్టిగానే సాగింది. దాదాపు రూ.6.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో.. రూ.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు గాలి సంపత్. కానీ.. కలెక్షన్లు ఊహించని విధంగా పడిపోవడంతో భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
ఏరియాల వైజ్ గా చూస్తే.. నైజాంలో రూ.25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. సీడెడ్ లో రూ.9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.15 లక్షలు, ఈస్ట్ లో రూ.6 లక్షలు, వెస్ట్ లో రూ.3 లక్షలు, గుంటూరులో రూ.20 లక్షలు, కృష్ణలో రూ.4 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలు మాత్రమే వసూలయ్యాయి.
Also Read: రామ్ చరణ్ సహాయానికి గెటప్ శ్రీను గుడికడతాడుః సత్య
క్లోజింగ్ కలెక్షన్లు కూడా కలిపి మొత్తంగా చూసుకుంటే.. కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది. కేవలం రూ.97 లక్షలు కలెక్ట్ చేసిందీ సినిమా. అంటే.. చిత్ర నిర్మాతలకు రూ.6.03 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఈ పెర్ఫార్మెన్స్ తో డిజాస్టర్ జాబితాలోకి వెళ్లిపోయింది. అనిల్ రావిపూడి బ్రాండ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్